‘గూఢచారి’ రివ్యూ

Updated By ManamFri, 08/03/2018 - 14:38
Gudachari Review
Gudachari Review

తెలుగు సినిమా కొత్త దారుల్లోకి అడుగు పెడుతుంది. అనే మాట‌ను ఈ  మ‌ధ్య త‌రుచూ వింటూ ఉన్నాం. కొత్త క‌థ‌ల‌తో ద‌ర్శ‌కులు, హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తున్నారు. రెండేళ్ల త‌ర్వాత మ‌రో హిట్ కొట్టాల‌నే ల‌క్ష్యంతో అడివిశేష్ చేసిన చిత్రం `గూఢ‌చారి`. క్ష‌ణం త‌ర్వాత అడివిశేష్ చేస్తున్న చిత్రం కావ‌డం ఒక‌వైపు.. గూఢ‌చారి టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ అన్నీ సినిమాపై అంచ‌నాల‌ను పెంచ‌డం మ‌రో వైపు.. కాబ‌ట్టి సినిమా కోసం కాస్త ఆస‌క్తిగానే అంద‌రూ ఎదురుచూశారు. మ‌రి ఈ అంచ‌నాల‌ను సినిమా ఏ మేర అందుకుందో తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం..

బ్యాన‌ర్స్‌: అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, విస్ట డ్రీమ్ మర్చంట్స్
న‌టీన‌టులు: అడివి శేష్‌, శోభితా దూళిపాళ‌, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాశ్ రాజ్‌, మ‌ధుశాలిని, అనీష్ కురివెల్ల‌, సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు
క‌థ‌: అడివిశేష్‌
స్క్రీన్‌ప్లే: అడివిశేష్‌, రాహుల్, శ‌శికిర‌ణ్ తిక్క‌
మాట‌లు: అబ్బూరి ర‌వి
ఎడిటింగ్‌: గారి బి.హెచ్‌
సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
కెమెరా: శ‌నీల్ డియో
స‌హ నిర్మాత‌:  వివేక్ కూచిబోట్ల
నిర్మాత‌లు: అభిషేక్ నామ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
ద‌ర్శ‌క‌త్వం: శ‌శి కిర‌ణ్ తిక్క‌

క‌థ‌:
సీక్రెట్ ఏజెంట్స్ అయిన స‌త్య‌(ప్ర‌కాశ్ రాజ్‌).. త‌న స్నేహితుడు బావ మ‌రిది అయిన మ‌రో సీక్రెట ఏజెంట్‌ను ప్ర‌త్య‌ర్థులు చంపేయ‌డంతో.. అత‌ని మేన‌ల్లుడు గోపి(అడివిశేష్‌) బాధ్య‌త‌ను తీసుకుంటాడు. గోపి పేరుని అర్జున్‌గా మార్చి పెంచి పెద్ద చేస్తాడు. అయితే అర్జున్ నాన్న‌లాగే రా డివిజ‌న్‌లో ప‌నిచేయాల‌నుకుంటాడు. మావ‌య్య ఒప్పుకోక‌పోయినా.. సీక్రెట్‌గా అప్లై చేసి జాబ్‌కి ఎంపిక‌వుతాడు. శిక్ష‌ణ తీసుకునే స‌మ‌యంలోనే సైకాల‌జిస్ట్ స‌మీర‌(శోభిత‌)ను ప్రేమిస్తాడు. అయితే టెర్ర‌రిస్టులు ప్లాన్ చేసి రా ఆఫీసర్స్‌తో పాటు.. స‌మీర‌ను చంపేసి ఆ నేరాన్ని అర్జున్‌పై వేస్తారు. త‌న‌పై అస‌లు కుట్ర చేసిందెవ‌రు? అని తెలుసుకోవ‌డానికి అర్జున్ చాలా ప్ర‌య‌త్నాలే చేస్తాడు. ఆ క్ర‌మంలో చాలా విష‌యాల‌ను తెలుసుకుంటాడు. అస‌లు మావ‌య్య స‌త్య‌కి, టెర్ర‌రిస్టు నాయ‌కుడు రాణాకి ఉన్న రిలేష‌న్ ఏంటి? అస‌లు రాలోని ద్రోహులెవ‌రు?   కుట్ర నుండి అర్జున్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌నేదే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్స్‌:
- ఆసక్తిక‌ర‌మైన క‌థ‌, స్క్రీన్ ప్లే
- నేప‌థ్య సంగీతం
- కెమెరా వ‌ర్క్‌
- నిర్మాణ విలువ‌లు
- ట్విస్టులు

మైన‌స్ పాయింట్స్:
-  రొటీన్ కమ‌ర్షియ‌ల్ కామెడీ సినిమాలు చూడాల‌నుకునే ప్రేక్ష‌కుల‌కు సినిమా న‌చ్చ‌క‌పోవ‌చ్చు

స‌మీక్ష‌:
సినిమా స‌క్సెస్‌కు న‌టీన‌టుల పెర్ఫామెన్స్‌తో పాటు మంచి క‌థ‌, ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం కూడా అవ‌స‌రం. ఈ మూడింటి విష‌యంలో అడివిశేష్‌.. శ‌శికిర‌ణ్ తిక్క అండ్ గ్యాంగ్ స‌క్సెస్ సాధించింది. ఓ స్పై థ్రిల్ల‌ర్‌ను స‌గ‌టు ప్రేక్ష‌కుడికి అర్థ‌మ‌య్యేలా తెర‌కెక్కించారు. శ‌శికిర‌ణ్ తిక్క‌, అడివిశేష్‌, రాహుల్ స్క్రీన్‌ప్లేను రాసుకున్న తీరు అభినందనీయం. హీరో, విల‌న్ ఇత‌ర పాత్ర‌ల‌కు ప్రాముఖ్య‌త‌నిస్తూ ప్ర‌తి పాత్ర‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. హీరో స‌మ‌స్య‌ల్లో ఇరుక్కున్న‌ప్పుడు  ఎలా త‌ప్పించుకున్నాడు.. స‌మ‌స్య‌ను చేధించే క్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న స‌మస్య‌లేంటి?  వ్య‌క్తిగ‌త బంధ‌మా?  దేశ‌మా? అని  చూసుకున్న‌ప్పుడు దేశం అని చెప్పే స‌న్నివేశాలు.. జ‌గ‌ప‌తి బాబు.. ప్ర‌కాశ్ రాజ్‌.. 22 ఏళ్ల త‌ర్వాత న‌టించిన సుప్రియ , అనీశ్ ఇలా అంద‌రికీ త‌గిన ప్రాధాన్య‌త ఉంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల నేప‌థ్య సంగీతం బావుంది. శ‌నీల్ డియో సినిమాటోగ్ర‌ఫీ ప్ర‌తి సన్నివేశాన్ని రిచ్‌గా చూపించారు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. 

బోట‌మ్ లైన్‌:  గూఢ‌చారి.. ఆక‌ట్టుకునే ఇండియ‌న్ జేమ్స్ బాండ్‌
రేటింగ్‌: 3.25/5

English Title
Goodachari review
Related News