‘భారత సినీ పితామహుడు’కి గూగుల్ నివాళి

Updated By ManamMon, 04/30/2018 - 09:53
dada saheb
Dada Saheb Phalke

‘భారత సినిమా పితామహుడు’ దాదా సాహెబ్ ఫాల్కే 148వ జయంతి సందర్భంగా ఆయనకు గూగుల్ నివాళులు అర్పించింది. గూగుల్ డూడుల్‌ను ఆయన ఫొటోలతో నింపి ఆయనకు ఘనంగా నివాళులు ఇచ్చింది. 

అయితే ఇప్పటి మహారాష్ట్రలోని త్రింబక్‌లో పుట్టిపెరిగిన ఫాల్కే చిన్నప్పటి నుంచే సినిమాకు సంబంధించిన వివిధ కళలపై మక్కువను చూపి వాటిపై పట్టు సాధించారు. ఈ క్రమంలో 1910లో అలీస్ గై దర్శకత్వంలో వచ్చిన మూకీ చిత్రం ‘ది లైఫ్ ఆఫ్ క్రిస్ట్‌’ చిత్రానికి పనిచేసిన ఫాల్కే ఆ సమయంలోనే సినిమాలను తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ తరువాత లండన్‌ వెళ్లి ఫిల్మ్‌ మేకింగ్ నేర్చుకొని వచ్చిన ఆయన 1931 సంవత్సరంలో భారత సినిమా తెరపై మొదటిసారిగా ‘రాజా హరిశ్చంద్ర’ అనే మూకీ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతి సినిమాలలో ఆయన భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింపజేశారు. అలాగు 19 సంవత్సరాల కాలంలో ఆయన దాదాపు 130 చిత్రాలు తీశారు. ఇక ఫాల్కే చివరి చిత్రం ‘గంగావతారన్’ 1932లో విడుదల కాగా.. 1944 ఫిబ్రవరి 16న ఆయన మరణించారు. ఆ తరువాత 1969లో భారత ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తుగా ఆయన పేరుపై అవార్డును ప్రకటించింది. సినిమా రంగంలో అత్యుత్తమ సేవలు చేసే వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందిస్తుంటారు. భారత సినిమాకు సంబంధించిన అత్యుత్తమ అవార్డులలో ఇది ఒకటి కావడం విశేషం.

English Title
Google Doodle celebrates 'father of Indian cinema' Dadasaheb Phalke Birth Anniversary
Related News