సవరణలకు కేంద్రం సిద్ధం

Updated By ManamThu, 02/15/2018 - 01:35
Government introduces Bill to amend Payment of Gratuity Act provisions in Lok Sabha

parlimentన్యూఢిల్లీ: ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ బిల్లు (ఎఫ్.ఆర్.డి.ఐ)ైపె కేంద్రం మనసు మార్చుకుంది. డిపాజిట్ బీమాకు గరిష్ఠ పరిమితిని ‘‘నిర్దిష్టంగా పేర్కొనేందుకు’’కు సిద్ధంగా ఉన్నట్లు అది పార్లమెంట్ సంయుక్త కమిటీకి తెలియుజేసింది. ఎఫ్.ఆర్.డి.ఐ బిల్లుపై ఏర్పాటు చేసిన కమిటీకి సీనియర్ బి.జె.పి నాయుకుడు భూపేందర్ యాదవ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వ తాజా వైఖరి గురించి ఈ కమిటీ ఆర్.బి.ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో సోవువారం చర్చించింది. అయితే, డిపాజిట్ బీమా పరిమితి లక్ష రూపాయులుగా ఉన్న ప్రస్తుత  నిబంధన పట్లనే గవర్నర్ మొగ్గు చూపుతున్నారు. ప్రతిపాదిత రిజల్యూషన్ కార్పొరేషన్, నియంత్రణ సంస్థల ద్వారా, సంస్థలు ప్రీమియంగా చెల్లించవలసిన మొత్తాన్ని పేర్కొనవచ్చని ఆర్థిక వ్యవహారాల శాఖ (డి.ఇ.ఏ) ఒక తాజా నోట్‌లో కమిటీకి తెలిపింది. అయితే, డి.ఇ.ఏ వైఖరిపై ఉర్జిత్‌కు కొన్ని భయాందోళనలున్నాయి.

‘‘బ్యాంక్ ఖాతాదారుల్లో 91 శాతం మంది లక్ష రూపాయల బీమా రక్షణలో ఉన్నారని ఆయన మాకు చెప్పారు. విలువ ప్రకారం చూస్తే, ఇది మొత్తం డిపాజిట్లలో  29 శాతం కిందకు వస్తుంది. మేం గరిష్ఠ పరిమితిని పెంచితే, బ్యాంకులపై అధిక బీమా ప్రీమియంల భారం పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత వ్యవస్థ కొనసాగడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. డి.ఇ.ఏ నూతన వైఖరిని పరిశీలించవలసిందిగా మేం ఆయునను అభ్యర్థించాం...ఏ సంగతీ మళ్ళీ చెబుతానని ఆయన మాతో అన్నారు’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కమిటీ సభ్యుడు ఒకరు చెప్పారు. డిపాజిట్ బీమా పెంచడానికి బిల్లులోని క్లాజు 29(1) వీలు కల్పిస్తోందని డి.ఇ.ఏ ఇంతకుముందు నియంత్రణ సంస్థలు, బ్యాంకులకు హామీ ఇచ్చింది. ప్రస్తుతం లక్ష రూపాయల వరకు ఉన్న డిపాజిట్ రక్షణనే కొనసాగిస్తామని బిల్లులో ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదని డి.ఇ.ఏ తన తాజా నోట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. డిపాజిట్ బీమా రక్షణ పరిమితిని నిర్దిష్టంగా పేర్కొనేందుకు బిల్లును సవరిస్తే సవరిస్తామని కూడా అది తెలిపింది. ఏ డిపాజిటర్‌కు సంబంధించి అయినా కార్పొరేషన్ చెల్లించే మొత్తం నగదు, 1961 నాటి డిపాజిట్ అండ్ క్రెడిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డి.ఐ.సి.జి.సి) చట్టంలోని 16వ సెక్షన్‌లో ఒకటవ ఉప విభాగంలోని రెండవ నిబంధన కింద నోటిఫై చేసిన మొత్తం నగదును మించి ఉండని విధంగా, బిల్లులోని 145వ సెక్షన్‌లో రెండవ ఉప విభాగంలోని క్లాజు (హెచ్) తర్వాత అదనపు క్లాజును చేర్చవచ్చని అది సూచించినట్లు తెలిసింది. కార్పొరేషన్ ఈ చట్టంలోని 29వ సెక్షన్‌లో  ఒకటవ ఉప విభాగం కింద వర్తించే మొత్తాన్ని నిర్దిష్టంగా పేర్కొనేంత వరకు ఈ ఏర్పాటును కొనసాగించవచ్చని అది సూచించింది.

‘‘1993లో నిర్ణయించిన లక్ష రూపాయల మొ త్తం చాలా తక్కువగా ఉందని, దాన్ని సవరించాలని వ్యక్తవువుతున్న ఆందోళనను ఇది పరిష్కరిస్తుంది. ఉర్జిత్ ఇచ్చి న వివరణతో, ఈ బిల్లుకు ఆర్.బి.ఐ వ్యతిరేకం కాదని, దానిలోని కొన్ని క్లాజులను మాత్రమే అది వ్యతిరేకిస్తోందని మాకు అర్థైమెంది. ఏకాభిప్రాయ సాధనే కమిటీ కర్తవ్యం’’ అని ఆ సభ్యుడు చెప్పారు. లక్ష రూపాయల పరిమితి కొనసాగించే విధంగా ఎఫ్.ఆర్.డి.ఐ బిల్లుకు కొత్త నిబంధన జోడించాలని ఆర్.బి.ఐ సూచించింది. సర్వీసు ప్రొవైడరు రిజల్యూషన్ ఫీజును ఎప్పటి వరకు చెల్లించవలసి ఉంటుందనే కాల పరిధిపై బిల్లులో స్పష్టత లేదని ఆర్.బి.ఐ పేర్కొంది. ప్రతిపాదిత రిజల్యూషన్ కార్పొరేషన్ పాత్రతో సహా బిల్లులోని క్లాజులపై ఏకాభిప్రాయ సాధనకు కేంద్రం, నియంత్రణ సంస్థలు, ఈ అంశంతో ప్రమే యం ఉన్న ఇతరులతో కమిటీ చర్చలు జరుపుతోందని ఆ సభ్యుడు తెలిపారు. బిల్లులోని వివిధ క్లాజులపై ఆర్.బి.ఐ, బ్యాంకులు, స్టాక్ ఎక్చ్సేంజీలు, బీమా కంపెనీలు, డిపాజిటరీలు గతంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. 

Tags
English Title
Government introduces Bill to amend Payment of Gratuity Act provisions in Lok Sabha
Related News