హెల్త్ చానెల్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు

Updated By ManamSun, 09/23/2018 - 22:42
paul

healthన్యూఢిల్లీ: ఆరోగ్య, పోషకాహార సామర్థ్యాలను పెంపొందించేందుకు హెల్త్ చానెల్‌ను ప్రారంభిచనున్నట్లు నీతి ఆయోగ్ సభ్యులు వీ.కే పాల్ తెలిపారు. ఆయన ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథక రూపకర్తల్లో ముఖ్యుడిగా ఉన్నారు. అది ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఆయూష్మాన్ భారత్) కింద పని చేయనుంది. దీని ద్వారా ఆరోగ్య, పోషకాహారాలకు సంబం దించిన విషయాలను వ్యాప్తి చేయనునున్నారు. ప్రస్తుతం ఈ చానెల్ ప్రారంభానికి సంభందించి పరిశధన దశలో పనులు సాగుతున్నట్లు పాల్ తెలిపారు. అది సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మకతలతో హెల్త్ చానెల్‌ను తీసుకురానున్నామని ఆయన అన్నారు. కాగా  27 రాష్ట్రాలు( కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి) ఆ చానెల్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన అన్నారు. నరేంద్రమోదీ ఆదివారం ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఈ చానెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రధాన మంత్రి ప్రారంభిచనున్న రెండో చానెల్, కాగా ఆయన 2015లో రైతుల కోసం డీడీ కిసాన్ చానెల్‌ను ప్రారంభించారు.

English Title
Government plans to start a health channel
Related News