ఏ పార్టీ అధికారంలో వున్నా... 

Updated By ManamWed, 09/26/2018 - 01:30
govt and its duties

కేంద్రంలోని బీజేపీ చేస్తున్న వికృత పోకడలకు సర్వత్రా వ్యతిరేక పవనాలు వీస్తున్న మాట విదితమే. స్వాతంత్య్రోద్యమ నేతల రాజ్యాంగ స్ఫూర్తి నేడు గద్దెనెక్కిన నాయకుల తలకెక్క డం లేదు. భిన్న భాషలు, మతాలున్న బహుళత్వ భారతా వని లో నిష్పాక్షికంగా ప్రజాపాలన సాగించడమే అత్యంత కీలకం. కానీ నేడు దేశంలో సెక్యులరిజం భావాలకు బీటలు పడు తు న్నాయి. హిందుత్వ భావజాలం ఉన్న పార్టీలకు ముస్లీంలు, దళి తులు ఒకింత వ్యతిరేకంగా ఉన్నారన్నది లోకవిదితం. మోదీ అధికారంలోకి వచ్చాక గోరక్షణ బృందాల పేరుతో బడుగు, బలహీనుల ఊచకోతను ముమ్మరం చేసి దేశ వ్యాప్తంగా అనేక దాడులకు పాల్పడ్డారు. 

మతం మత్తు మందు అని అన్నాడు కారల్ మార్క్స్. నేడు భారతావనిలో మతం అంటే దళితులు, మైనారిటీలు, మహిళల పాలిట మృత్యుపాశం. ప్రపంచం రోజు రోజుకు సాంకేతికత వైపు పరుగులు తీస్తుంటే కాషాయ పాలకులు మాత్రం తిరో గమన దారిలో సమాజాన్ని మళ్లీ చీకటి యుగాల వైపు నడిపిం చడం ఆశ్చర్యకరం. సామాజిక న్యాయం, సామరస్యతకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేవలం ప్రకటనలకు మాత్ర మే పరిమితం అయ్యింది తప్పా ఎక్కడా ఆచరణ శుద్ధి కనిపిం చడం లేదు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, ఒక దళి తుడైన రామనాథ్ కోవింద్‌ను దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి లో ఉంచి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడినట్టుగా గొప్పలు చెబుతున్నారు. మరోవైపు ఆరాచక శక్తులు మునుపెన్నడూ లేనంతగా మూకుమ్మడి దాడులకు తెగబడి విజృంభించడం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశవ్యాప్తంగా దళితు లపై హత్యలు, లైంగికదాడులు, సాంఘీక బహిష్కరణలు కొన సాగుతూనే ఉన్నాయి. సామాజిక న్యాయం, సామరస్యతకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేవలం ప్రకటలను మాత్రమే పరిమితం అయ్యింది తప్ప ఎక్కడా ఆచరణ శుద్ధి కనిపించడం లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు దళితులపై దాడుల తీవ్రత బాగా పెరిగింది. ఈ ఏడాది జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలను పరిశీలిస్తే, గత పదేళ్లలో (2007-17) దేశంలో దళితులపై హింస 66 శాతం పెరిగింది. ప్రతి 15 నిమిషాలకు ఒక దళితునిపై కేసు నమోదు అవుతోంది.  కేంద్ర హోమ్ శాఖ 2018, ఏప్రిల్లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, దళితులపై జరుగుతున్న దాడుల కేసుల్లో కేవలం 16.3 శాతం మంది నిందితులకు మాత్రమే శిక్ష పడుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో మూడువేల అల్లర్లు జరిగాయి. వాటిలో 389మంది మరణించగా 8,890 మంది గాయపడ్డారని కేంద్ర హోంశాఖ చెబుతున్న నివేదిక. ఇందులో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 121మంది మరణిం చారు. ఇక మూక అల్లర్లలో మరో 27మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 

దేశంలో విద్వేషపూరిత దాడులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని దేశవ్యాప్తంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 67 ద్వేషపూరిత దాడులు దళితులపై జరగ్గా.. ముస్లింలపై 22 దాడులు జరిగాయని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఈ ద్వేషపూరిత దాడుల్లో ఎక్కువగా గోసంరక్షణ పేరిట దాడులు, పరువు హత్యలు జరు గుతున్నాయని ఆమ్నెస్టీ రిపోర్టు తెలిపింది. పౌర సమాజాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు దాడులు చేసే మూకల వైపు నిలబడుతున్నాయి. ప్రతి 18 నిమిషాలకు ఒక దళితవ్యక్తి దాడులకు గురవుతున్నారు. రోజులో ముగ్గురు దళిత మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు. ప్రతి మూడు స్కూళ్లకు ఒక స్కూళ్లో దళితుల పిల్లలు ఇతరులతో వేరుగా కూర్చుంటున్నారు. 28శాతం గ్రామాల దళితులు పోలీసుస్టేషన్లోకి అనుమతించ బడడం లేదు. సగం గ్రామాల్లో మంచి నీటి వనరులను పొంద డానికి నిరాకరించబడుతున్నారు. 70శాతం మహిళలు నిరక్షరా స్యులు, వేలాది మంది దళితుల ఆడపిల్లలు వ్యభిచారంలోకి నెట్టబడుతున్నారు. ఎక్కడ హిందుత్వానికు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని నిర్మూలించే వరకు అసహన దాడులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతిని ఎండగట్టి అవినీతి రహిత పాలనను అందిస్తామని గద్దెనెక్కిన తరువాత అవినీతి విషయంలో అతని కంటే ఘనుడనే రీతిలోనే మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అడుగడున అస్మదీయుల కొమ్ము కాస్తుంది. ఆశ్రిత పెట్టుబడి దారీ విధానంతో వికృత విన్యాస ప్రదర్శనలో గత పాలకులను మించిపోయారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు చెబుతూ సాచివేత ధోరణిని అవలం భిస్తున్నారు. ’సబ్ కా సాత్... సబ్ కా వికాస్’ అంటూ అభివృద్ధి గురించి పలు నినాదాలు ఇచ్చి... ’చోర్ కే సాత్... సబ్ కా వికాస్’ అన్న ధోరణిని అవలంభిస్తున్నారు. దేశ భద్రతకు దెబ్బతీసే విధంగా కేంద్రం రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పం దంలో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ పార్టీకే చెందిన అరుణ్శౌరి, యశ్వంత్సిన్హా ప్రకటించారు. ఇది బోఫోర్స్ కంటే పెద్ద కుంభకోణమని చెప్పారు.  అమిత్షా తనయుడు జై షా కంపెనీ టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ టర్నోవర్ ఒక్కసారిగా 16వేల శాతం పెరగటం వెనక కథేమిటో జగమెరిగిన సత్యం. మోదీకి అత్యంత సన్నిహిత సంస్థ అయిన ఎస్సార్ ఆయిల్స్ ద్వారా దాదాపు రూ. 50 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు దేశంలో చర్చ జరుగుతున్నది. లిక్కర్ కింగ్ విజయమాల్యా వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టినా కూడా స్వేచ్ఛగా విదేశాలకు వెళ్లేలా బీజేపీ నాయకులు సహకరించారు. పంజాబ్ నేషనల్ బ్యాం కుకు రూ.11,400 కోట్లు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? .ఎల్.పీ.జీ గ్యాస్ విషయంలో మోదీ సర్కారు దాదాపు రూ. 23 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని లోకం కోడై కూస్తుంది. గుజరాత్లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ. 25 వేల కోట్లకు లెక్కలు సరిగా లేవని కాగ్ చెప్పింది. 21 జాతీయ బ్యాంకులు దెబ్బతిన్నాయి. 11 బొగ్గు గనులను దాదా పు ఒకే సంస్థకు మోదీ ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రంలో విద్యా పన్ను వేల కోట్లు లెక్కలు తేలడం లేదని అదే విధంగా ఐటీ ఉద్యోగుల పన్ను మాయం, దుర్వినియోగం అని కాగ్ చెప్పింది.

ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ఏ మున్నది గర్వ కారణం అన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ కో హటావో... దేశ్ కో బచావో.. అదే నేడు బీజేపీ కో హటావో..  దేశ్ కో బచావ్ అంటున్నారు. నాయకులు అధికా రాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్న సొమ్మును దాచుకుంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పేదరికం నిర్మూలించాలి. సమ సమాజ స్థాపనకు కృషి చేసే విధంగా అడుగులు వేయాలి. 

- అజీజ్
రాజకీయ విశ్లేషకులు

English Title
govt and its duties
Related News