15న 'జీపాట్-2018' ఫలితాలు 

Updated By ManamTue, 02/13/2018 - 18:03
GPAT 2018 Results, Graduate Pharmacy Aptitude Test ,  pharmacy graduates

GPAT 2018 Results, Graduate Pharmacy Aptitude Test ,  pharmacy graduatesన్యూఢిల్లీ: గ్రాడ్యూయేట్ పార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్  జీపాట్-2018 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్వహించిన జీపాట్-2018 పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఈ నెల 15న విడుదల చేసి ఏఐసీటీఈ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఏఐసీటీఈ జీపాట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోరే అభ్యర్థులు ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఫార్మసీ కాలేజీ యూనివర్శిటీల్లో (10+2 తరువాత నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ) గ్రాడ్యుయేట్ ఫార్మసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. గతనెల 21న దేశవ్యాప్తంగా జీపాట్-2018 ప్రవేశపరీక్షను ఏఐసీటీఈ నిర్వహించింది. ఏఐసీటీఈ నోటిఫికేషన్ ప్రకారం జీపాట్-2018 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈ నెల 15న సాయంత్రం 5గంటల తరువాత విడుదల కానున్నాయి. పరీక్ష ఫలితాల వివరాల కోసం http://aicte-gpat.in అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 

పరీక్ష ఫలితాల కోసం.. 
-
జీపాట్ http://aicte-gpat.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 
- రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయాలి
- అభ్యర్థి వివరాలను ఎంటర్ చేయాలి
- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే ఫలితాలు చూసుకోవచ్చు. 

English Title
GPAT 2018 Results To Be Declared Soon
Related News