అవసరమైతే గ్రేహౌండ్స్ రంగంలోకి: హోంశాఖ

Updated By ManamSun, 09/23/2018 - 18:58
SP Sunil datt, AP boarders, Police stations, Grayhounds forces, Chandrababu naidu

SP Sunil datt, AP boarders, Police stations, Grayhounds forces, Chandrababu naiduఅమరావతి: భద్రాద్రి, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర సరిహద్దులను ఎస్పీ సునీల్ దత్ అప్రమత్తం చేశారు. ప్రజాప్రతినిధులు పర్యటనల సమాచారం స్థానిక పోలీసు స్టేషన్‌లకు ఇవ్వాలని సూచనలు చేశారు. అరకులో పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఇంచార్జి డీజీపీ హరీశ్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. విశాఖ బేస్ క్యాంప్ నుంచి ఆరు ప్రత్యేక బృందాలు పంపేందుకు నిర్ణయించారు. అవసరాన్ని బట్టి గ్రేహౌండ్స్‌ను రంగంలోకి హోంశాఖ దించనుంది. ఎప్పటికప్పుడు అరకులో పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. 

మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు న్యూయార్క్ చేరుకున్నారు. అరకు ఎమ్మెల్యే హత్యపై ఎయిర్‌పోర్టు నుంచే ఏపీ అధికారులతో ఫోన్లో సమీక్ష నిర్వహించారు. కాగా, మావోయిస్టుల దాడిలో మృతిచెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు భౌతికకాయాన్ని విశాఖలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు తరలించారు. 

English Title
Grayhound forces will be alert at Vizag
Related News