లిబియా తీరంలో పెను విషాదం

Updated By ManamTue, 09/11/2018 - 22:22
Libya
  • మునిగిన వలసదారుల బోటు.. 100 మందికిపైగా మృతి

Libyaకైరో: లిబియా తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో వలసకు యత్నించిన 100 మంది ప్రాణాలు కోల్పోయారని డాక్టర్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ ప్రకటించింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారంతా లిబియా నిర్భందంలో ఉన్నారని తెలిపింది. సెప్టెంబరు 1వ తేదీన జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆ సంస్థ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి వారిలో గర్భిణులు, చిన్నారులు ఉన్నారని, కొందరు కాలిన గాయాలతో బాధపడుతున్నారని తెలిపింది. తమ సంస్థ తరఫున వైద్య సాయం అందిస్తున్నామని తెలిపింది. సుడాన్, మాలి, నైజీరియా, కామెరూన్, ఘనా, లిబియా, ఈజిప్టు తదితర ప్రాంతాల నుంచి యూరప్‌కు వలసకు యత్నించిన వారిని తీసుకువెళుతున్న రెండు రబ్బరు లిబియా తీరం నుంచి బయలుదేరాయి. అందులో ఒక బోటు మునిగిపోయింది. రెండు పడవల నుంచి మొత్తం 276 మందిని లిబియా కోస్టు గార్డు రక్షించింది. కొంతకాలంగా ఆఫ్రికా దేశాల నుంచి యూరప్‌కు అక్రమంగా ప్రవేశించడానికి యత్నించే వారికి లిబియా ప్రధాన కేంద్రంగా మారింది.

Tags
English Title
Great tragedy on the Libya coast
Related News