రాలుతున్న ‘మొగ్గలు’

Updated By ManamSat, 09/08/2018 - 00:40
mathanam

ప్రపంచ ఆకలి సూచీలో 119 దేశాల జా బితా ఉంటే, ఇందులో మనదేశ స్థానం నూరు. దీన్ని రుజువు చేస్తూ పదేళ్లు నిం డని ముగ్గురు పిల్లలు దేశ రాజధాని ఢిల్లీ లో పార్లమెంట్ భవనానికి కూతవేటు దూరంలో ఆకలితో చనిపోయిన ఇటీవలి సంఘటన దేశ ప్రజలను కలచి వేసింది. ‘ఆకలిచావు కాదు, అనారోగ్యంతో చావు’ అని ప్రభుత్వం ‘మసిపూసి మారేడు కాయ’ చేయడానికి వీల్లేకుండా పోస్టుమార్టం తేల్చడంతో పాలకులకు పాలుపోకుండా చేసింది. ఒకవైపు ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ ఆకలిచావులు మాత్రం దే శాన్ని పట్టిపీడిస్తునే వున్నాయి. సంక్షోభం, పేదరికం వంటి సమస్యలతో సతమతమవుతున్న ఉత్తర కొరియా, బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే కూడా మనదేశంలో ఆకలి తీవ్రరూ పం దాల్చుతున్నది. ఈ విషయా న్ని ఇప్పటికే ‘అంతర్జాతీయ ఆహార విధాన పరిశో దన సంస్థ’ స్పష్టం చేసింది. 2008 నుంచే మ న దే శం ఆకలి సూచికలో ప్రమాణాలు దిగజారుతూ వస్తున్నా యి. తొమ్మిదేళ్ల క్రితం 35.6 పాయింట్లతో ఉండగా ఇప్పుడు 28.5కి చేరింది.

image


పంచవర్ష ప్రణాళికలలో బాలల కోసం పొందుపరిచిన ప్రత్యేక ప్రణా ళికలు ఆచరణలో అమలు కాకపోవడంతో ఆకలిచావుల సంఖ్య గణనీ యంగా పెరుగతూ వస్తున్నాయి. పోషకాహారం అందకపోవడం ఒక ఎత్త యితే, 20 కోట్ల మంది ప్రజలు అర్థాకలితో, ఒక్కోసారి ఆహారం లేకుండా నీళ్లుతాగి నిద్రలోకి జారుకుంటున్నారు. విద్య, ఆరోగ్యం, జీవన ప్రమా ణా ల కొలబద్దతో చూచినపుడు మన దేశ జనాభాలో 55 శాతం పేదరికంలో మగ్గుతున్నట్లు ‘ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి’ నివేదిక తెలిపింది. అయినప్పటికీ, శరవేగంతో అభివృద్ధి చెందుతున్నామని భరోసా ఇవ్వడా నికి మన ప్రభుత్వాలు తరచుగా వృద్ధిరేటును ఉదహరిస్తున్నాయి. దారిద్య్ర రేఖ నుంచి ఎంతోమందిని తప్పించినట్లు లెక్కలు ఏకరువు పెడుతున్నాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక లెక్క ప్రకారం మనదేశ జనాభాకంతటికీ ఏడాది పొడవునా కడుపు నిండాలంటే సుమారు 23 కోట్ల టన్నుల ఆహారం అవ సరముంది. కానీ గతేడాది మన ఆహార దిగుబడి సుమారు 27.33 కోట్ల టన్నులు. అంటే నాలుగున్నర కోట్ల టన్నులు మిగులు సాధించాము. అయినప్పటికీ ఆకలిచావులు నిత్యకృత్యమవుతున్నాయి.

ప్రభుత్వ పం పిణీ వ్యవస్థలోని లోపాలు, విధానపరమైన నిర్లక్ష్యమే ఈ ఆకలి చావులకు కారణమవుతున్నాయి. పైగా దేశంలో ఉత్పత్తి అవు తున్న ఆహార ధాన్యాల్లో 40 శాతం వృధా అవుతున్నా యి. నిల్వచేయడానికి సరిపడ గోదాములు లేక పో వడం వల్ల చెడిపోవడం, ఎలుకలు, పురు గు లు తినడంతో ధాన్యం దుర్వినియోగ మ వుతున్నది. 2011-17 వరకు గోదా ముల్లో 61,824 టన్నుల ఆహార ధాన్యాలు చెడిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు తేల్చా యి. ఈ వృధా ధా న్యాన్ని పరి రక్షించి నట్ల యితే సుమారు 8 లక్షల మం దికి ఏడాది పాటు ఆహార కొరత తీర్చే అ వకాశముండేది. రాజ్యాంగం లోని 21వ అధికరణం కింద ప్రతి మనిషికి జీవించే హక్కు హామీ ని ఇవ్వగా, ఇందులో భాగంగా పౌరులకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధిగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లక్షల టన్నుల ఆహార ధాన్యాలను గోదాములలో మురగబెట్టే బదులు పేద లకు ఉచితంగా పంపిణీ చేయాలని తెలిపింది. దీంతో 2013 లో అప్పటి యుపిఏ ప్రభుత్వం ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ ను అమలులోకి తెచ్చింది. ఈ చట్టం కింద దేశంలోని పేద కుటుం బాలకు బియ్యం, గోధుమలు, సజ్జలు, జొన్నలు తదితరమైన ధాన్యాలు అతి తక్కువ ధరకు అందే అవకాశం చిక్కింది. గర్భిణీ మహిళలు, చిన్నా రులకు ఉచితంగా పంపిణీ చేయాలి. ఉచిత పంపిణీ మాత్రం జరుగడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు బాలికలు ఆకలికి అలమటించి మర ణించిన సంఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అభివృద్ధి మార్గా న్ని జఠిలం చేస్తున్నది.

ఎనిమిదేళ్ల మన్సి, నాలుగేళ్ల శిఖ, రెండేళ్ల పరుల్ జూలై 24న ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు ఆసుపత్రి వ ర్గాలు వెల్లడించాయి. శవ పరీక్షలో ఆ పిల్లలు ఆకలితో మరణించినట్లు ని ర్ధారించాయి. ఈ సంఘటనకు ఆరునెలల ముందు నుంచే ఆకలిచావుల వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. జార్ఖండ్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్‌ల నుంచి ఎక్కువగా ఆకలి చావుల సంఘటనలు చోటుచేసుకు న్నా యి. వీటిపైన నిజనిర్ధారణ సంఘాల నివేదికలు, మీడియాలో వచ్చిన వార్తలు వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపా యి. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అందవలసిన సదుపాయాలు అంద కనే ఆకలిచావుల సంఘటనలు జ రుగుతున్నట్లు స్పష్టం చేశాయి. సామాజిక భద్రత కొరవడ టం, ఉన్నతాధికార వర్గా ల అలసత్వం, ఆయా రా ష్ట్రాలకు నిధుల కొరత వంటివి కారణాలుగా పేర్కొన్నారు.

జాతీయ ఆహార భ ద్రతా చట్టం ప్రకారం ప్ర భుత్వ పంపిణీ ద్వారా సబ్సి డీ ధాన్యం అందాలి. బడికెళ్లే పిల్లలకు మధ్యాహ్న భోజనం పె ట్టాలి. తల్లులకు పోషకాహారం అం దాలి. అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు పోషకాహారం అందించాలి. ఇప్పటివరకు జరి గిన ఆకలి మరణాల కుటుంబాలకు ఇవేవి అందలే వని స్పష్టమవుతుంది. మరణించిన ముగ్గురిలో మున్సి వాస్తవానికి బడికి వెళ్ళాల్సిన వయస్సు. ఉచిత, నిర్బంధ విద్య ఆమెకు విద్యాహక్కు చట్టం ద్వారా అందాలి. మిగిలిన ఇద్దరికి అంగన్ వాడి ద్వారా పోషకాహారం అం దాలి. ఇవేవి వారి ఛాయల వరకు వెళ్ళలేదు. సామాజిక భద్రతకు తగి న వ్యవస్థలు అమలులో ఉన్నా అణగారిన వర్గాలకు ఆ సదుపా యాలు అందడం లేదన్నది ఈ మరణాలు స్పష ్టపరుస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాం తాలలో సామాజిక వంట శాలలు ఏర్పాటు, గిరిజన ప్రాం తాలలో ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావాలి. సెలవు రోజులలో పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అములు చేయాలి. వీటివల్ల చాలావరకు ఆకలి చావులు జరుగకుండా నిరోధించవచ్చు. 

రెండు దశాబ్దాలుగా ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పధకం, అంగన్‌వాడీలు తదితరమైనవి అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆకలిచావులు ఎందుకు జరుగుతున్నాయన్నది ప్రభు త్వాలు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరముంది. ఒకపక్క ఆర్ధి కాభివృద్ధి జరుగుతున్నప్పటికీ, చాలామందికి జీవనోపాధికి, గౌరవ ప్రదమైన జీవనానికి అడుగడుగునా ఆటంకాలు తలెత్తుతున్న విష యాన్ని గుర్తించాలి. ఉపాధి అవకాశాలు కొరవడుతున్న తీరు, అందాల్సిన పథకాలలో అవినీతి చోటు చేసుకుంటున్న వాస్తవాలని అంగీకరించాలి. వీటిని సరిదిద్దాలి. అనేక కుటుంబా లు దుర్భర జీవితాన్ని గడుపుతున్న తీరును సమీ క్షించుకోవాలి. ఈ కుటుంబాల నుంచే ఆకలి చావులు జరుగుతున్నా యన్నది వాస్తవం. ఈ నిరుపేద కుటుంబాలకు ఆహారం, పోషకా హారం, ఆరోగ్యసేవలు అందు బాటులోకి తీసుకురావటంపై ప్రభుత్వాలు దృష్టిసారిం చాలి. ఆకలిచావులపై అనవ సరమైన వాగ్యుద్ధాలకు పోకుండా సామాజిక సం క్షేమ పథకాలు అందేం దుకు అవసరమైన కార్యా చరణ రూపొందించటం తక్షణ అవసరంగా పాలకులు గుర్తించాలి.

- కోడం పవన్‌కుమార్
సీనియర్ జర్నలిస్టు
9848992825

Tags
English Title
Growing 'buds'
Related News