డిజిటల్ లావాదేవీల్లో వృద్ధి

Updated By ManamTue, 11/06/2018 - 22:14
Debit-Card-PoS-transaction
  • పెద్ద నోట్లు రద్దయి నవంబర్ 8కి రెండేళ్ళు

Debit-Card-PoS-transactionహైదరాబాద్: రెండేళ్ళ క్రితం పెద్ద నోట్ల రద్దు అమలులోకి వచ్చిన తర్వాత, డిజిటల్ చెల్లింపులు అనేక రెట్లు పెరిగాయి. ప్రభుత్వం 2016 నవంబర్ 8న రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆ నోట్లను బ్యాంకులలో జమ చేసి కొత్త నోట్లను తీసుకునేందుకు ప్రభుత్వం అప్పట్లో కొంత గడువును విధించింది. అయితే, వాటి స్థానంలో కొత్త నోట్లు రావడంలో జాప్యం జరగడంతో దేశవ్యాప్తంగా కరెన్సీకి తీవ్ర కొరత ఏర్పడింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆ కొరత  ఏడాదికి పైగా కొనసాగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ)ల వద్ద అందుబాటులో ఉన్న డాటా ప్రకారం, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (ఎన్.ఇ.ఎఫ్.టి), మొబైల్ బ్యాంకింగ్ వంటి ప్రాచుర్యం పొందిన మార్గాలలో డిజిటల్ చెల్లింపులు 2016 సెప్టెంబర్ 2018 సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రగాఢంగా ఉన్నాయి. 

ఎన్.ఇ.ఎఫ్.టి లావాదేవీల విలువ 2016 సెప్టెంబర్‌లో (పెద్ద నోట్ల మార్పిడికి రెండు నెలల ముందు) రూ. 988,000 కోట్లుగా ఉన్నది 2017 సెప్టెంబర్‌లో రూ. 14,182,000 కోట్లకు, 2018 సెప్టెంబర్‌లో రూ. 8,015,000 కోట్లకు పెరిగింది. మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ కూడా 2015 సెప్టెంబర్‌లో ఉన్న రూ. 2,700 కోట్ల నుంచి 2016లో రూ. 104,300 కోట్లకు, 2017లో రూ. 186,200 కోట్లకు పెరిగింది. ‘‘మొత్తం డిజిటల్ లావాదేవీలన్నింటినీ కలిపితే, పెద్ద నోట్ల రద్దు నుంచి వాటి విలువ 440 శాతం పెరిగినట్లు లెక్క’’ అని పేస్‌విఫ్ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ ప్రధాన కార్యనిర్వహణాధికారి ఆర్. ప్రభు తెలిపారు. ఈ వృద్ధికి టైర్ 2, టైర్ 3 మార్కెట్లు చోదక శక్తిగా వ్యవహరించాయి. వీటిలో చాలా మార్కెట్లు పెద్ద నోట్ల రద్దుకు ముందు డిజిటల్ లావాదేవీలకు దూరంగా ఉండేవని ఆయన అన్నారు.

English Title
Growth in digital transactions
Related News