జిమ్నాస్టిక్స్‌లో నిరాశ  దీపాపైనే ఆశలు

Updated By ManamFri, 08/24/2018 - 02:47
sindhu

sindhuతెలుగు తేజం అరుణ బుద్దా రెడ్డితో పాటు ప్రణతి నాయక్ ఆసియా గేమ్స్ మహిళల వ్యక్తిగత వాల్ట్ ఫైనల్లో నిరాశ పరిచారు. వీరిద్దరూ ఏడు, ఎనిమిది స్థానా ల్లో నిలిచారు. దీంతో బ్యాలెన్స్ బీమ్‌లో పాల్గొనే దీపా కర్మాకర్‌పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. ఇండియా ఒక్కటే ఇద్దరు అథ్లె ట్లలో ఈ ఈవెంట్‌లో పాల్గొంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నప్పటికీ పతకం సాధిం చడంలో వీరిద్దరూ విఫలమయ్యారు. రి యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి ప్రపంచ గుర్తింపు పొందిన దీపా కర్మా కర్‌కు క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే మోకాలికి గాయం కావటంతో ఆమె పాల్గొ నలేదు. ఈ వ్యక్తి గత విభాగంలో ఒక్కో దేశం నుంచి ఇద్దరు మాత్రమే పాల్గొనాల్సి ఉంది.

Tags
English Title
Gymnastics is hopelessly hopeless
Related News