రెండో ఏడాది తగ్గిన హెచ్1బీ వీసా దరఖాస్తులు

Updated By ManamSun, 04/15/2018 - 22:17
visa

imageన్యూఢిల్లీ: ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి స్థానికుల ఉపాధి కోసం విదేశీ వలసలపై ఉక్కు పాదం మోపుతున్నారు. దీంతో వరుసగా రెండో ఏడాదీ హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే వారి సంఖ్య తగ్గింది. 2018-19 సంవత్సరంలో అక్టోబర్ నుంచి అనుమతించే విదేశీ వృత్తి నిపుణులకు సంబంధించి 1.90 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అమెరికా ఏజెన్సీ యూఎస్సీఐఎస్ వెల్లడించింది. అంతకుముందు సెషన్లో అనుమతించిన దాదాపు 2 లక్షల దరఖాస్తుల కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. 2017-18 సంవత్సరం కంటే ఈసారి వచ్చిన దరఖాస్తులు 8902(4.5%) తగ్గాయి. ట్రంప్ అధికార గణం యూఎస్ దేశానికి వచ్చే వృత్తి నిపుణులను నియంత్రించేందుకు తీసుకున్న కఠిన చర్యలే ఇందుకు కారణం. గత కొన్ని నెలల్లో భారత ఐటీ కంపెనీలన్నీ స్థానిక నియామకాలకు ప్రాధాన్యతనిస్తుండటం వల్లే హెచ్-1బీ వీసాల విషయంలో ఆసక్తి తగ్గిపోయినట్లు తెలుస్తోంది. 2013-14 నుంచి ప్రతి సంవత్సరం యూఎస్సీఐఎస్ హెచ్1-బీ వీసాల విషయంలో లాటరీ పద్దతిని అనుసరిస్తోంది. 2016-17 సంవత్సరంలో ఈ విధమైన హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తుల సంఖ్య అత్యధికంగా 2.4లక్షలుగా నమోదయింది. ప్రస్తుతం అభ్యర్థులు ప్రయత్నించిన దరఖాస్తులను ఆ సంఖ్యతో పోల్చి చూస్తే 20% తగ్గుదల కనబడుతోంది.

English Title
H1B visa applications for second year term
Related News