హైదరాబాద్‌లో కూలిన పురాతన భవనం

Updated By ManamThu, 10/18/2018 - 17:20
Hyderabad: old building collapses in Basheer bagh
old building collapses in Basheer bagh

హైదరాబాద్: నగరంలోని బషీర్‌భాగ్ చౌరస్తాలోని ఓ పురాతన భవనం కూలింది. అయితే  సెలవుదినం కావడంతో దుకాణాలు అన్ని మూసి ఉండటంతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భవనం కూలుతుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. భవనం సమీపంలోని హోటల్ మెగాసిటీకి సంబంధించిన పార్కింగ్ వాహనాలను అక్కడ నుంచి తొలగించడంతో ఆస్తి నష్టం జరగలేదు. కాగా పురాతన భవనంపై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

English Title
Hyderabad: old building collapses in Basheer bagh
Related News