రండి.. మాతో కలవండి

Updated By ManamSat, 12/30/2017 - 14:24
Hardik Patel Invites Gujarat Deputy CM Nitin Bhai Patel
  • గుజరాత్ డిప్యూటీ సీఎంకు హార్దిక్ పటేల్ ఆఫర్

Hardik Patel Invites Gujarat Deputy CM Nitin Bhai Patelఅహ్మదాబాద్: గుజరాత్ డిప్యూటీ సీఎంకు పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు, పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ ఓ ఆఫర్ ఇచ్చారు. తమతో కలిసి నడవాలని ఆయన్ను ఆహ్వానించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారం రోజులైనా కాకముందే.. గుజరాత్ ప్రభుత్వంలో లుకలుకలొచ్చిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్ భాయ్ పటేల్‌కు ఇచ్చిన ఆర్థిక శాఖ, పట్ణాభివృద్ధి, పెట్రోలియం శాఖలను బీజేపీ వెనక్కు తీసుకోవడంతో.. అసహనంతో ఉన్న ఆయన బాధ్యతలు తీసుకోలేదు. దీంతో ఇదే అదునుగా భావించిన హార్దిక్ పటేల్.. నితిన్ పటేల్‌కు ఆహ్వానం పంపారు. బీజేపీలోని తమ వర్గానికి చెందిన నేతకు ఆ పార్టీ గౌరవం ఇవ్వడం లేదని, ప్రతిఒక్కరూ ఆయన తరఫున నిలబడాలని హార్దిక్ కోరారు.

‘‘బీజేపీ సరైన గౌరవం ఇవ్వడం లేదనుకుంటే నితిన్ పటేల్ మాతో చేరొచ్చు. ఆయన బీజేపీ కోసం ఎంతో శ్రమించారు’’ అని అన్నారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో భాగంగా శనివారం బోతద్‌లో చింతన్ శిబిర్ కార్యక్రమం నిర్వహించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆయన బీజేపీని వీడాలనుకుంటే.. ఆయన చెబుతున్నట్టు మరో 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన వెంట వస్తే.. మేం మద్దతిస్తాం. నేను కాంగ్రెస్‌తో మాట్లాడి ఆయనకు ప్రాధాన్యమున్న పదవిని ఇప్పిస్తాను’’ అని అన్నారు. మరోవైపు బీజేపీ లుకలుకల విషయాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోందని, ఆ మధ్య ఆనందిబెన్ పటేల్‌ను, ఇప్పుడు నితిన్ పటేల్‌ను బీజేపీ లక్ష్యం చేసుకుందని కాంగ్రెస్ గుజరాత్ అధ్యక్షుడు భరతసిన్హ సోలంకి అన్నారు. నితిన్ భాయ్ పటేల్ తమకు మద్దతిచ్చి, మరో కొంత మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేవని సోలంకి చెప్పారు. 

English Title
Hardik Invites Gujarat Deputy CM
Related News