ఈవీఎంల ట్యాంపరింగ్

Updated By ManamSun, 12/17/2017 - 23:17
hardik patel, gujrat
  • బీజేపీ గెలిస్తే అదే కారణం: హార్దిక్ పటేల్

hardik patel, gujratఅహ్మదాబాద్, డిసెంబరు 17: అత్యంత హోరాహారీగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో  వెల్లడికానున్న నేపథ్యంలో పటీదార్ నేత హార్థిక్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంల)ను బీజేపీ ట్యాంపరింగ్ చేసే అవకాశముందని ఆయన అన్నారు. మొత్తం 17 జిల్లాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన హార్థిక్ పటేల్.. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేయడంతో ఈ ట్వీట్లను పటీదార్లు (పటేల్ సామాజికవర్గం) సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రజలను రెచ్చగొట్టే సందేశాలు కూడా ఉంటున్నాయి. వడోదరలోని కర్జాన్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సైతం ఎన్నికల ఫలితాలపై ప్రజలను రెచ్చగొట్టేరీతిలో వీడియో మెసేజ్ పోస్టు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. అది ఆ పార్టీ చేసుకున్న స్వయం కృతాపరాధం. బీజేపీ కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారానే గుజరాత్ ఎన్నికలను గెలువగలదు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయి గుజరాత్ ఎన్నికల్లో గెలువడం ద్వారా ఎవరికీ అనుమానాలు రాకుండా చూడాలని బీజేపీ చూస్తోంది. ఈవీఎం రిగ్గింగ్‌కు పాల్పడకపోతే బీజేపీ గుజరాత్‌లో 82 సీట్లకు మించి గెలువదు. బీజేపీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది. అలా కాకుండా బీజేపీ గెలిచిందంటే అది ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే..’’ అని హార్థిక్ అన్నారు. 

English Title
hardik patel, gujrat
Related News