క్షీణించిన ఆరోగ్యం.. వీలునామా రాసిన యువనేత

Updated By ManamMon, 09/03/2018 - 09:30
Hardik

Hardikగాంధీనగర్: గుజరాత్‌లో పటేళ్లకు రిజర్వేషన్లు, రైతు రుణమాఫీ చేయాలని గత పది రోజులుగా అమరణ దీక్ష చేస్తున్న యువనేత హార్ధిక్ పటేల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయన వీలునామా రాసి సంచలనం సృష్టించారు. తన ఆస్తులను పంచుతూ హార్ధిక్ వీలునామా రాశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50వేలలో తల్లిదండ్రులకు రూ.20వేలు, పంజ్రపోల్ గ్రామాంలో ఆవుల షెడ్ నిర్మాణానికి రూ.30వేలు ఇవ్వాలని అందులో తెలిపారు.

అలాగే తన జీవితగాథపై వస్తున్న ‘హూ టుక్ మై జాబ్’ అనే బుక్ విక్రయాల ద్వారా వచ్చే రాయల్టీ, తనపై ఉన్న బీమా డబ్బులు, తన కారు అమ్మగా వచ్చిన మొత్తాన్ని తల్లిదండ్రులు, చెల్లలితో పాటు మూడు సంవత్సరాల క్రితం పటీదార్ ఉద్యమం సమయంలో మరణించిన 14మందికి సమానంగా పంచాలని తెలిపారు. ఈ విషయాలను పటీదార్ సంఘం అధికార ప్రతినిథి మనోజ్ పనారా తెలిపారు. ఇక ఈ దీక్షలో తాను మరణిస్తే కళ్లను దానం చేయాలని హార్ధిక్ చెప్పారు.

English Title
Hardik Patel health sinks, releases will
Related News