అమల్లో 144 సెక్షన్.. నిరవధిక దీక్షకు హార్దిక్..  

Updated By ManamSat, 08/25/2018 - 13:59
Hardik Patel, indefinite hunger strike, section 144 impose, Ahmedabad

Hardik Patel, indefinite hunger strike, section 144 impose, Ahmedabadఅహ్మదాబాద్: పటేళ్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమించి మూడేళ్ల పూర్తి అవుతున్న నేపథ్యంలో పాటిదార్ అన్మత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్దిక్ పటేల్ శనివారం నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. అహ్మదాబాద్‌లోని సత్యాగ్రహ్ చవానీ ప్రాంతంలో దీక్షకు పోలీసు యంత్రాంగం అనుమతి నిరాకరించడంతో ఆయన తన నివాసం వద్దే నిరవధిక దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అహ్మదాబాద్‌లో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో బహిరంగ ప్రదేశాల్లో గుంపుగా కనిపించటానికి వీలు లేదని పోలీసులు హెచ్చరించారు. పాటీదార్లకు ఓబీసీ రిజర్వేషన్, రైతు సమస్యలపై ఒకరోజు నిరాహార దీక్షలో పాల్గొనేందుకు నికోల్ వెళ్తుండగా గత ఆదివారం హార్దిక్ పటేల్‌, ఇతర పాటీదార్ నేతలను అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

అనంతరం ఆయన ముందస్తు బెయిల్ మీద బయటకు వచ్చారు. హార్దిక్ ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పటేల్ ముందస్తు బెయిల్‌ను తిరస్కరించాలంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. మూడేళ్లుగా పాటిదార్ రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.  

English Title
Hardik Patel to launch indefinite hunger strike, section 144 imposed in Ahmedabad
Related News