'ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం'

Updated By ManamWed, 11/22/2017 - 12:00
Hardik Patel, Congress has assured him, Patidar quota, BJP, Gujarat assembly elections
  • రిజర్వేషన్ల కోటా ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుంది.. అధికారంలోకి వచ్చాక కోటాపై బిల్లు తెస్తామని హామీ

  • ఎన్నికల మేనిఫెస్టోలో పాటిదార్ కోటా చేరుస్తామంది.. మీడియాతో పాటిదార్ కోటా ఉద్యమ నేత హార్దిక్ పటేల్..  

Hardik Patel, Congress has assured him, Patidar quota, BJP, Gujarat assembly electionsఅహ్మదాబాద్: పటేల్ వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుందని పాటిదార్ కోటా ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌ స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నట్టు ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పటేల్ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న తమ పోరాటానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేస్తామని హార్దిక్ పేర్కొన్నారు. బుధవారం అహ్మదాబాద్‌లో హార్దిక్ మీడియా సదస్సులో మాట్లాడుతూ.. తమ షరతులకు కాంగ్రెస్ అంగీకరించిందని, విద్యాసంస్థల్లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని, ఇతర వెనుకబడిన తరగుతుల వర్గాలు (ఓబీసీ) వారికి కూడా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు ఆయన చెప్పారు.

‘ఇన్నేళ్లుగా బీజేపీ వ్యతిరేకించిన మా డిమాండ్లను కాంగ్రెస్ అంగీకరించింది. కోటా విషయంలో కూడా హామీ ఇచ్చింది’ అని 24 ఏళ్ల పటేల్ వెల్లడించారు. పటేల్ కోటాను కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి గుజరాత్‌లో అధికారంలోకి రాగానే పటేల్ రిజర్వేషన్ బిల్లు అమలులోకి తెచ్చేలా చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన ఉద్ఘాంటించారు. కాంగ్రెస్ కోటా ఫార్మూలా ఆమోదయోగ్యంగా ఉండటంతో తాను అంగీకరించినట్టు హార్దిక్ చెప్పారు. కాగా, వచ్చే నెల 9 నుంచి గుజరాత్‌లో రెండు దశల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

English Title
Hardik Patel says Congress has assured him of Patidar quota at par with OBCs
Related News