శ్రీదేవి, మాధురిలాగే సన్నీ కూడా ఒక నటి

Updated By ManamMon, 06/11/2018 - 12:59
sunny

hardik, sunny నర్గిస్, శ్రీదేవి, మాధురి దీక్షిత్ లాగే సన్నీ లియోన్ కూడా ఒక నటేనని ఆమెకు మద్దతుగా మాట్లాడారు పటేదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్. ఓ మీడియా సమావేశంలో సన్నీ లియోన్‌పై అతడి అభిప్రాయం అడగగా.. ఇతర నటీనటులను చూసినట్లు సన్నీని ఎందుకు చూడలేరని ప్రశ్నించారు.

గతంలో ఆమె పోర్న్‌స్టార్‌గా పనిచేసిందని ఇప్పుడు కూడా ఆమెను తప్పుడు దృష్టితో చూడటం సబబు కాదని తెలిపారు. దేనిపై అయినా మన ఆలోచనా విధానం మారకపోతే దేశం ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు. కాగా ఓటర్లకు రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు హార్దిక్ జులై నుంచి మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సన్నీ లియోన్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

English Title
Hardik Patel on Sunny Leone
Related News