అభిమానులకు ఆఖరి లేఖ రాసిన హరికృష్ణ

Updated By ManamWed, 08/29/2018 - 09:52
Harikrishna

Harikrishnaసెప్టెంబర్ 2న హరికృష్ణ 63వపుట్టినరోజు జరగాల్సి ఉండగా.. ఆ వేడులకు జరపొద్దని అభిమానులకు హరికృష్ణ ఓ లేఖను రాశారు. తన పుట్టినరోజున ఫ్లెక్సీలు పెట్టొద్దని, అలంకరణలు, బొకేలు వద్దని.. ఆ  ఖర్చును కేరళ వరద బాధితులకు అందజేయాలని హరికృష్ణ ఆ లేఖలో రాశారు. ఈ మేరకు తన సన్నిహితుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేత ఓ లేఖను తయారు చేయించుకున్నారు. అయితే ఆ లేఖను మీడియాకు విడుదల చేయకముందే ఆయన మృతి చెందారు. కాగా ఇదే లేఖను హరికృష్ణ కూడా ఇంకా చూడలేదు.  ఇదిలా ఉంటే ఈ సంవత్సరం పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని భావించిన హరికృష్ణ ... శాశ్వతంగా ఈ లోకం విడిచివెళ్లడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

harikrishna
English Title
Harikrishna last letter to fans
Related News