నేడు హరికృష్ణ పెద్ద కర్మ.. పూర్తైన ఏర్పాట్లు

Updated By ManamSat, 09/08/2018 - 09:22
Harikrishna

Harikrishnaగత నెల 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ  పెద్ద కర్మ ఇవాళ జరగనుంది. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ గ్రాండ్ లాన్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికి జలవిహార్‌లో ఏర్పాట్లు పూర్తి కాగా, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీనికి హాజరయ్యే అవకాశం ఉంది.

అయితే నెల్లూరు జిల్లాలో ఓ వివాహ వేడుక కోసం గత నెల 29న హరికృష్ణ కారులో వెళుతుండగా.. నార్కట్‌పల్లి సమీపంలో ఆయన కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన హరికృష్ణను కామినేని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

English Title
Harikrishna Pedda Karma Today
Related News