వ్యవసాయ అధికారులతో హరీశ్ సమీక్ష

Updated By ManamSat, 09/22/2018 - 17:47
harish rao review meeting
harish rao review meeting on marketing

హైదరాబాద్ : తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు శనివారం మార్కెటింగ్, సీసీఐ, మార్క్ ఫెడ్, వేర్ హౌస్, హాకా, వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...అక్టోబర్ పదో తేదీలోగా 25 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు.

Harish Rao Review Meeting On Marketing And Ware Housing

మిగిలిన కేంద్రాలను అక్టోబర్ 20లో తెరవాలని ఆదేశిస్తూ...98 మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే 288 జిన్నింగ్ మిల్స్‌ను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫైడ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక పెసల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్ ఫెడ్ అధికారులకు మంత్రి హరీశ్ సూచనలు చేశారు. 

English Title
Harish Rao Review Meeting On Marketing And Ware Housing Issues
Related News