సమ్మిళిత సమనాణ్యతే లక్ష్యం

Updated By ManamSat, 09/08/2018 - 00:53
mathanam

‘ఒకే ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక అన్నారు కాళోజీ’
ఏ దేశమైన సర్వతోముఖా భివృద్ధి సాధించాలంటే సంపూర్ణ అక్ష రాస్యతా అత్యంత ప్రధానం, అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని గమనించిన ఈ విషయం మనకు తెలుస్తుంది. వివిధ రంగాలల్లో నైపుణ్య తను సాధించాలంటే అక్షరాస్యత జ్ఞానం కలిగి ఉండ టం అత్యంత అవశ్యకమన్నది విడ్డురంగా అనిపించిన అది అక్షర సత్యం. ఉదా హరణకు వ్యవసాయం చేయడానికి అక్షరాస్యులై ఉండనవసరం లేదు కాని నూతన సాగుపద్ధ తులను కనిపెట్టడంలోను, అధిక దిగుబడి సాధించడంలో ను రైతులు కొద్దోగొప్పో చదువుకున్న వారేనన్నది మనందరికి తెలిసిందే.

ప్రజల జీవన ప్రమాణల మెరుగుదలకు అక్షరాస్యతా సాధించడం ముఖ్యం కనుకనే సెప్టెంబర్ 8వ తేదీని ‘అంత ర్జాతీయ అక్షరాస్యత’ దినోత్సవంగా 1965 నవంబర్ 17న యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ ప్రకటించింది.

భాషను ఉపయోగించేందుకు చదవటం, రాయటం, వినటం, మాట్లడటం అనే నాలుగు ప్రాథమికాంశాలు తెలు సుకోవటాన్నే అక్షరాస్యత అనవచ్చు. అయితే రాయడం, చ దవటం, మాత్రమే అక్షరాస్యత కాదనీ గౌరవం, అవకా శాలు, అభివృద్ధి గురించి చేప్పడమే నిజమైన అక్షరాస్యత అని కొంతమంది పెద్దలు చెబుతుంటారు.

ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు విద్య, విజ్ఞానం ఎంతో అవసరం కొన్ని దేశాలు అన్ని రకా లుగా వెనుకబడి ఉండటానికి నిరక్షరాస్యత ప్రధాన కార ణంగా చెప్పవచ్చు. అంతర్జా తీయ అక్షరాస్యత దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? అక్షరాస్యతను వ్యక్తులు, సమా జాలకు అందించటం. ఇది పిల్లల్లో విద్యపైనే గాకుండా వయోజన విద్య మీద కేంద్రీకరించబడుతుంది. ఐక్యరాజ్య సమితి విద్యావిజ్ఞాన (శాస్త్రీయ), సాంస్కృతిక సంస్థ (యు నెస్కో) ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రధాన అంగం. ఇది  ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945లో స్థాపించారు ఈ సం స్థ తన క్రీయశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణలకు తోడ్పా టు నందించడగాక అంతర్జాతీయ సహకారంతో విద్య, వి జ్ఞానం, సాంస్కృతిక పరిరక్షణ కోసం పాటుపడుతుంది. 195 మంది సభ్యులు 11 మంది అసోసియేట్ సభ్యులు కలిగిన యునెస్కో ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉంది. దీని ప్రధాన అంగాలు మూడు వాటిలో మొదటిది విధాన నిర్ణయాల కోసం, రెండవది అధికార చె లామణి కోసం, మూడవది దైనందిన కార్యక్రమాల కోసం పాటు పడతాయి. యునెస్కో తన కార్యక్రమాలను ఐదు రంగాలలో నిర్వహిస్తుంది. అవి విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక, మానవ శాస్త్రాలు, సంస్కృతి, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్, యునెస్కో, విద్య ద్వారా ‘అంతర్జాతీయ నాయ కత్వం’ కొరకు అవకాశాల కల్పనలో తనవంతు కృషి చే స్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం వివిధ దేశాలలో విద్యావిధా నాలను క్రమబద్ధీకరిం చడం, ట్రైనింగ్ రీసెర్చ్‌లు చేపట్ట డం, ప్రజాప్రకటనలిచ్చి ప్రజలను చైతన్యవంతం చేస్తుంది, సాంస్కృతిక, శాస్త్రీయ ఉద్దేశ్యాలు కలిగిన ప్రాజెక్టులను చేప డుతుంది. ‘భావ వ్యక్తీకరణ స్వాతంత్య్రాన్ని ఇన్ఫ ర్మేషన్ టెక్నాలజీని’ ప్రోత్సహిస్తుంది. మీడియా ద్వారా సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాం తాలను తయారుజేయడం వివిధ ఈవెంట్‌లను ప్రోత్స హించడం.

యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవ త్సరంగా ప్రకటించింది ఇక ఐక్యరాజ్య సమితి అయితే 2003-2012 దశబ్దాన్ని ‘అక్షరాస్యత దశాబ్దంగా’ ప్రకటిం చింది. ‘లిటరసీ ఫర్ ఆల్’, ‘వాయిస్ ఫర్ ఆల్’, లెర్నింగ్ ఫర్ ఆల్’, అనే అంశాన్ని ఈ దశాబ్ధి లక్ష్యంగా నిర్దేశించింది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పొలిస్తే అక్షరాస్యత విషయం భారతదేశంలో (74.4 శాతం) తక్కు వ స్థాయి ఉన్నట్లు చెప్పవచ్చు. ఈ మతమైనా మనదేశ  అక్షరాస్యత ఉందంటే దానికారణం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అక్షరాస్యతను సాధించటంలో ముందుండటం ఉదాహరణకు కేరళ (94 శాతం), లక్షద్వీప్ (92 శాతం), అ క్షరాస్యతను సాధించడంలో ముందుండటం మరికొన్ని రాష్ట్రాలు బిహార్, మణిపూర్, రాజస్థాన్, తెలుగు రాష్ట్రాలు సగటు అక్షరాస్యత శాతానికి దూరంగా ఉన్న విషయం తెలి సిందే. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగంమంది భారతదేశంలోనే ఉండటం విచారకరం స్థిరమైన ఆర్థికా భివృద్ధి సాధించాలంటే దేశంలో 80 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది.

భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ 2014 జూన్ 2న ఆవిర్భవించింది. అక్షరాస్యత జాబితాలో తెలంగాణ (66.5 శాతం)తో దేశంలో 31వ స్థానంలో ఉన్నది. 2011 జనాభా గణన ప్రకారం తెలంగాణలో ఏడెళ్లు లేదా ఆపై బడ్డ వయసున్న వారు 3,11,04,508 మంది ఉన్నారు. వారిలో 1,55,93,698 పురుషులు, 1,55,10,810 మంది మహిళలు ఉన్నారు. ఈ జనాభాలో 2,06,96,778 మంది అక్షరాస్యులు ఉన్నారు. అంటే రాష్ట్ర జనాభా 66.5 శాతం అక్షరాస్యతా రేటు సాధించింది. అది 74.4 శాతంగా ఉన్న సగటు జాతీయ అక్షరాస్యతా రేటు కంటే తక్కువ. అదే విధంగా తెలంగాణలో జిల్లల్లా ప్రకారం అక్షరాస్యతా గ్రామ, పట్టణ ప్రాంత జనాభాలలో అక్షరాస్యత రేటులో చాలా వ్యత్యాసం ఉన్నది. పట్టణ ప్రాం తాల్లో అక్షరాస్యత 81 శాతంగా ఉం టే, గ్రామీణ ప్రాంతాల్లో అది కేవలం 57 శాతం మాత్రమే. అక్షరాస్యత రేటు పురుషుల్లో 75 శాతం ఉంటే స్త్రీలలో 57.9 శాతంగా ఉంది. స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం దేశ వ్యాప్తంగా 16.25 శాతం ఉండ గా తెలంగాణలో 17.1 శాతంతో రాష్ట్రాల జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. వయోజన, యువజన అక్షరాస్యతా రే టు యువజన అక్షరాస్యతా రేటు జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో 9 శాతం ఎక్కువ 24 ఏళ్లు కంటే మించిన వారితో అక్షరాస్యతా రేటు జాతీయ సగటు కంటే తెలం గాణ చాలా వెనకబడి ఉన్నది. తెలంగాణలో పెద్దవారిలో కంటె పిల్లల తరంలోనే విద్య అందుబాటులోకి వచ్చింది. జిల్లాల పునర్విభజనతో తెలంగాణలో మొత్తం 31 జిల్లాలు ఉన్నాయి.
 
అక్షరాస్యత రేటులో హైదరాబాద్ జిల్లానే 83.25 శాతంతో మొదటి స్థానంలో ఉండగా జోగులాంబ గద్వాల జిల్లా 49.87 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. సంవత్స రాలుగా, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ‘అందరికీ విద్య’ లక్ష్య సాధనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సహస్రాభివృద్ధి లక్ష్య అనంతర కాలంలో ప్రపంచం సుస్థిర అభివృద్ధి ఎజెండా వైపుకు మళ్ళింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో నాలుగో లక్ష్యం 2030 నాటికి సమ్మిళిత సమాన నాణ్యత గల విద్యను అందించడం.

చదవాలిరా ఎన్ని అటంకలు వచ్చినా చదువు లేకపోతే మన బతుకు నిండు సున్న అని అన్నాడు ఒక కవి ఊరిలో, వీధిలో పరిసరాలలో ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులను చేసి దేశాభివృద్ధికి తమవంతు కృషి చేయ డం విద్యావంతులైన వారు తమ బాధ్యతగా భావించి అందుకు పూనుకోవాలి ‘అంతర్జాతీయ అక్షరాస్యత దినం’ సందర్భంగా ఆ బాధ్యతను నెరవేర్చడానికి కంకణ బద్ధులు అవుదాం.

- ఓరగంటి ఎల్లయ్య
పరిశోధక విద్యార్థి
9959373019
(నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం)

Tags
English Title
A harmonious integrity target
Related News