హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు శుభవార్త

Updated By ManamMon, 08/06/2018 - 20:57
HDFC Bank, Revise Fixed Deposit, Interest Rates, 

HDFC Bank, Revise Fixed Deposit, Interest Rates, న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు శుభవార్త. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారా? అయితే మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు వడ్డీరేటును పెంచింది. ప్రస్తుతం ఉన్న దానిపై 0.6శాతం వడ్డీరేటును పెంచుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించింది. తద్వారా పెంచిన రేట్లును సోమవారం నుంచే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. తాజాగా పెంచిన వడ్డీరేట్లు ఆరు నెలల ఒకరోజు నుంచి 5 సంవత్సరాల డిపాజిట్లపై వర్తిస్తాయి. ఇకపై 6 నెలల నుంచి 9 నెలల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 6.75శాతం వడ్డీరేటు లభించనుంది. 9 నెలల మూడు రోజుల నుంచి ఏడాది కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును పొందవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రెండు సంవత్సరాల ఒక రోజు నుంచి 5ఏళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గతంతో పోలిస్తే 10 బేసిస్‌ పాయింట్లను పెంచింది. తద్వారా ఖాతాదారులు వడ్డీని కూడా పొందవచ్చు. కాగా, జులై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆర్‌బీఐ సమీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో ఆర్బీఐ పావు శాతం మేర (రెపో రేటు 6.5 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 6.25 శాతం చేరాయి) రేట్ల పెంపునకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. 
HDFC Bank, Revise Fixed Deposit, Interest Rates, 

English Title
HDFC Bank Revises Fixed Deposit Interest Rates With Effect From Today
Related News