ప్రపంచంలో అతి పెద్ద వృద్ధుడు ఇతనే

Updated By ManamWed, 04/11/2018 - 00:10
He is the oldest elder in the world
  • 112 ఏళ్ల ఇతనికి స్వీట్లంటే ప్రాణం!

imageటోక్యో:  జపాన్‌కు చెందిన మసాజో నోనకా ప్రపంచంలోనే అతి పెద్ద వృద్ధుడిగా చరిత్ర సృష్టించాడు. 112 ఏళ్ల వయసున్న ఇతనికి స్వీట్లంటే ప్రాణమని, ఇదే అతని ఆరోగ్య రహస్యమంటూ మసాజో కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1905, జూలై 25న జపాన్ ఉత్తర ప్రాంతంలోని హొక్కాయిడో ద్వీపంలో మసాజో జన్మించారు. ‘సూపర్ సెంటినేరియన్’గా పేరుగాంచిన ఈయన మొత్తం ఐదుగురు సంతానంతో కలిసి సంతోషంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న తమ తాతయ్యకు బయటికి వెళ్లాలంటే మాత్రం చక్రాల కుర్చీ అవసరమవుతుందని మనవరాలు వివరిస్తోంది. రోజూ వార్తాపత్రికలు చదవడం ఈయన ప్రధాన వ్యాపకం.  ఫిబ్రవరిలో స్పెయిన్‌కు చెందిన 113 ఏళ్ల న్యూనెజ్ ఒలివెరా మరణంతో, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మసాజో నోనకాకు ఈ స్థానం దక్కింది. దీర్ఘాయుష్షుకు పేరుగాంచిన జపాన్‌లో 100 సంవత్సరాల పైబడ్డ స్త్రీ-పురుషులు అత్యధికంగా ఉన్నారు.  ఇలా జపాన్ దేశంలో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నవారి సంఖ్య అధికారికంగా 68,000 ఉన్నట్టు ప్రభుత్వం గత ఏడాది గణాంకాలు విడుదల చేసింది.

English Title
He is the oldest elder in the world
Related News