ఫుడ్ ప్రింట్‌తో వైద్యం

Updated By ManamMon, 04/16/2018 - 00:10
image
image

1987లో నేచురోపతిలో గ్రాడ్యుయేుషన్ పూర్తిచేసిన డాక్టర్ సత్యలక్ష్మి నల్గొండలో నేచురోపతి క్యూర్ సెంటర్‌ను స్థాపించి ప్రజలకు వైద్యసేవలు అందించారు. ఆ తరువాత 1996లో ఆమె హైదరాబాద్‌కు మకాం మార్చారు. తాను ఫెమినిస్టు వోల్గా నుంచి స్ఫూర్తి పొందానని, ‘సబల’ అనే మహిళా సంఘాన్ని స్థాపించి మహిళా చట్టాలైపె మహిళలకు అవగాహన కల్పించేందుకు, చర్చ లు, సమావేశాలు ఏర్పాటుచేయడం వంటి కార్య క్రమలు నిర్వహించారు. 1996లో హైదరాబాద్‌లో నేచురోపతి ఆసుపత్రిని స్థాపించారు. అనం తరం అమీర్‌పేటలో యోగ అధ్యయన పరిషత్‌ను ప్రారంభించారు. అనంతరం వేమన యోగ అధ్యయన పరిషత్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2015 నుంచి ఆమె పూనెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆరోగ్యరంగంలో ఆమెకు 2018లో మహిళాదినోత్సవం సందర్భం గా తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళాదినోత్సవ అవార్డును ప్రకటించింది.

నల్గొండ జిల్లాకు చెందిన డాక్టర్ సత్యలక్ష్మి నేచురోపతిలో గ్రాడ్యుయేట్ చేశారు. 1988లో నల్గొండలో నేచురోపతి క్యూ ర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆమెతో ఇంటర్వ్యూ...

ప్ర: మీరు నేచురోపతి వైద్యంలో నిష్ణాతులు కదా! అయితే ఆహారపు అలవాట్లపై ఎందుకు కేంద్రీకరించి పని చేస్తున్నారు?
జ:
నేషనల్ ఇన్య్సూటూట్ ఆఫ్ నేచరల్ ఈ సంస్థ పూనె డైరెక్టర్‌గా పనిచేస్తున్నా. నేచురోపతి అంటే ప్రకృతి వైద్యం, యోగా పరంగా ఫుడ్ అనేది ఒక మెడిసిన్. ఆహారా న్ని ప్రకృతి వైద్యం ఒక మందులాగా వినియోగిస్తుంది. అం దువల్ల మనం స్వీకరించే ఆహారంపైనే ఆరోగ్యం, చికిత్స ఆధారపడి ఉంటుంది. అయితే మనం తింటున్నది ఏదో మనకు తెలియని ఒక దుర్మార్గపు వాతావరణంలో మనం ఉన్నాం. దాని వల్ల ప్రజారోగ్యం ఘోరంగా దెబ్బతింటోంది. దీనికి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు ఎవరికి వారు మాది బాధ్యత కాదు అనేటటువంటి వైఖరి ఉంది. మనం తినేదానికి మనం బాధ్యులం మన ఆరోగ్యానికి మనం బాధ్యులం అనే భావనను దీక్షగా మనం పెట్టుకోవాలి. డాక్టర్లు, ప్రభు త్వం, ఆసుపత్రులు అందుకు బాధ్యత తీసుకోవాలి. ఒకటి అగ్రికల్చర్ లింక్, రెండు మార్కెట్ లింక్, మూడు మన ఆహారం ఈ మూడింటిని విడివిడిగా చూడకుండా కలిపి చూడగలిగే దృక్పథం అమర్చుకోవాలి. ఈ విషయంలో అ వెురికా కొంచెం తెలివిగలవారు వాళ్లు ఎఫ్‌ఎఓ అని పెట్టా రు. అంటే ఫు డ్ అండ్ అగ్రికల్చర్ అనే నియంత్రణ సంస్థ ను ఏర్పాటు చేశారు. మనవాళ్లు ఎందుకు ఆహారాన్ని, వ్యవ సాయాన్ని కలిపి చూడరు. దేనికి దాన్ని విడిగా చూస్తున్నా రు. ఫుడ్ అండ్ అగ్రికల్చరే కాకుండా ఆరోగ్యం కూడా కలిపి ఎఫ్‌ఎహెచ్ అనే దృక్ప థాన్ని రూపొందించాలి. ఎందుకంటే పం జాబ్‌లో మొట్టమొదటగా హరిత విప్లవం ప్రవేశపెట్టారు. దానివల్ల అక్కడి ప్రజలు ఆరోగ్యం పూర్తిగా నాశన మైంది. క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత ‘ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్’లో అప్పటి లెక్కల ప్రకారం ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అధి కంగా నీటి వినియోగించే వంగడాలతో సాగే హరిత విప్లవం వల్ల భూసారం కరిగిపోయి విచ్ఛిన్నమవుతోంది. కాబట్టి ఆర్టి ఫియల్ ఫర్టిలైజర్స్ వేస్తున్నారు. దాంతో కృత్రిమంగా పంట లు పండుతాయి. క్రిమికీటకాలు, కలుపు మొక్కల్ని కంట్రోల్ చేయటానికి వీడిైసెడ్స్, పెస్టిైసెడ్స్ ఇవన్నీ రసాయన పదార్థాలు విపరీతంగా వాడుతున్నారు. దాంతో ఒకప్పుడు గ్రామాలు శుభ్రంగా ఉండేవి. పట్టణాలు అపరిశుభ్రంగా కనబడేవి కాని ఇప్పుడు రెండు నాశనం చేసుకుంటున్నాము. ఇక్కడేమో ఆర్బన్ పొల్యూషన్ ఉంటే అక్కడేమో గ్రామాల్లో రసాయనిక కాలుష్యం ఎక్కువగా వుంది. ఇది మేము పదేళ్ళ క్రితమే ఖమ్మం దగ్గర చినమండువా గ్రామంలో ఒక సంవత్సరంలోనే 5 క్యాన్సర్ కేసులు వచ్చాయి. ఇళ్లలో యూరి యా, పైస్టిైసెడ్స్ డబ్బాలుంటాయి. వాటి మధ్యనే ఉంటూ వాటినే పీల్చుతూ వాటి మధ్యనే బతకటం వల్ల జబ్బులు వస్తున్నాయి.  అందువల్ల ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం అనే వి మూడూ అంశాలను సమన్వయంతో ప్రకృతి వైద్యం చేయవలసి ఉంటుంది. అందుకు ప్రజల్ని చైతన్యపరు స్తున్నాం. ‘పుడ్ ప్రింట్’ భావనను ప్రచారం చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. 

ప్ర: ఫుడ్ ప్రింట్ అంటే ఏమిటి? ప్రజారోగ్యం దెబ్బ తిన డాన్ని ఆ భావన ద్వారా ఎలా అంచనా వేయగలం? 
జ: మన ఆహారం మన టేబుల్ మీదకి రావాలంటే అది ఒక ఎడిబుల్ ఫామ్ తీసుకోవాలి. మన ఆహారాన్ని తినటానికి కావాలసినంత తయారు చేసుకోవటానికి ఎంతైతే ఇంధ నం/ శక్తి ఖర్చు అవుతుందో ఆ ఇంధనాలకు అయ్యే ఖర్చు ను లెక్కిస్తే, వచ్చే మొత్తాన్ని దాని ఎనివిరాల్ మెంటల్ కాస్ట్ ఆఫ్ ది ఫుడ్ (ఆ ఆహారం కోసం వెచ్చించే పర్యా వరణ ఖర్చు) అని అంటారు. మనకు మాములుగా ఆహారం ఎం త శక్తిని ఇస్తుందో ఆ ఆహారం విలువను లెక్కగడతా ము. అంటే ఈ లెక్క కిలో క్యాలరీల శక్తి రూపంలో ఉంటుంది. ఇన్ని కిలో క్యాలరీస్ శక్తి రావటానికి ఎన్ని కిలో క్యాలరీస్ శక్తిని మనం ఇంధనం రూపంలో ఖర్చు చేశామన్నది లెక్కిం చాలి. ఆహారం నుంచి లభించే శక్తి కంటే అది ఉత్పత్తి అయి డైనింగ్ టేబుల్ మీదకి చేరేసరికి మనం చేస్తున్నశక్తి విని యోగం చాలా ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు తెలియజే స్తున్నాయి. ‘ది నెట్ వర్త్ ఈజ్ నెగిటివ్’. ఈ ఫుడ్ ప్రింట్‌ను ఆహార ఉత్పత్తి, రవాణా, ప్రాసెసింగ్ వగైరా ప్రక్రియల గుం డా సాగడంలో జరిగిన శక్తి వినియోగం బట్టి ఫుడ్ వైుళ్లలో అంచనా వేస్తాము. ఉదాహరణకు మన ఇంటి వెనకాల చెట్టునుంచి జామకాయను తెచ్చుకొని తింటే మనకు లభిం చే శక్తికి దానిలో ఉన్న శక్తికి తేడా ఉండదు. అంటే ఆ పం డులోని పూర్తి శక్తి మనకే వస్తుంది. ఎందుకంటే అది నేచర్ నుంచి శక్తిని ఫిక్స్ చేస్తున్నది కాబట్టి, దాని ఉత్పత్తి, రవా ణాలో ఇలాంటి ఇంధన శక్తి వినియోగం వచ్చి చేరదు. అదే ఒక న్యూయార్క్ ఆపిల్‌ను తింటే, మనకు జామకాయ తింటే వచ్చిన 2000 కిలో క్యాలరీల శక్తికి సమానంగా వస్తుందనుకుందాం. కానీ దానిపై ఉత్పత్తి, రవాణా, ప్రాసె సింగ్ లపై ఖర్చు చేసిన శక్తిని కలుపుకొని చూసినట్లయితే 20,000 కిలో క్యాలరీలు దాకా ఉంటుంది. అట్లాగే అన్నం పండించటానికి ఎన్నినీళ్లు సరఫరా చేస్తున్నాము. అక్కడ సాగునీటి వాడకానికి కూడా దాని ఉత్పత్తి, సరఫరాలలో అయ్యే శక్తి ఫుడ్ మైళ్ల రూపంలో లెక్కించాల్సి ఉంటుంది. దాని ఫుడ్ ప్రింట్ కూడా క్యాలికిలేట్ చేయాలి. అగ్రికల్చర్‌లో ఉపయోగించే శక్తి అంటే దున్నపోతులు, ఎడ్లను వాడారంటే బయోఎనర్జీ (జీవశక్తి )కి పెద్దగా ఖర్చు లేదు. అట్లా కాకుండా ఎప్పుైడెతే ఫాజిల్ ప్యూయల్స్‌ను (డీజిల్ తదితరాలు) ఉపయోగిస్తుంటే అప్పుడు ఫుడ్ మైల్స్ పెరిగిపోతున్నాయి. అం టే పర్యావరణ వినిమయ ఖర్చులు పెరుగుతున్నాయి. అది అంత క్యాలికిలేట్ చేసి మీరు తినే అన్నం నుంచి మీకు చేరే 2000 కిలో క్యాలరీల శక్తితో పాటు, ట్రాన్ప్‌ఫోర్టు, అన్ని కలు పుకుని లెక్కిస్తే మొత్తం 80వేల కిలో క్యాలరీలవుతుంది. దాంతో రెండువేల కిలోకేలరీల కోసం అదనంగా 18వేల కిలోకేలరీలను భూగోళ ఇంధన వనరులను ఖర్చు చేస్తుండడంతో పర్యావరణ విధ్వంసానికి, వాతావరణ మార్పులకు దారితీస్తోంది. సజ్జలు, కొరలు, జొన్నలు ఇవి నీరు ఆధారిత పంటలు కావు రెయిన్ ఫెడ్ క్రాప్స్. స్టోరింగ్ పెద్ద సమస్య కాదు. తినేటప్పుడు వచ్చిన శక్తితో పోలిస్తే ఫుడ్ మైల్స్‌ను పోల్చి చూస్తే దాదాపు సమానంగానే ఉంది. ఎందుకంటే అవి లోకల్ కాబట్టి. గోధు మలు తింటామంటే అవి పం జాబ్ నుంచి రావాలి. వాళ్ళు బియ్యం తింటామంటే ఇక్కడ నుంచి పోవాలి. పీడీఎస్ నుంచి గోధుమలు, బియ్యం, పప్పులు, నూనె, పంచదార సరఫరా చేస్తాము. ఇవన్నీ కూడా పర్యావరణనికి వ్యతిరేకంగా పని చేస్తున్నవే. దీని బదులు లోకల్ పంటలు పెంచి, వాటిని ఆహార అలవాటు గా మార్చుకుంటే శక్తి వినియోగం గణనీయంగా తగ్గిపో తుంది. పర్యావరణానికి మేలు చేస్తుంది. 

ప్ర: ఫుడ్ ప్రింట్ విషయంలో మీ కార్యాచరణ ఏమిటి? 
జ: స్థానిక ఆహారాన్ని ఉత్పత్తి చేయడంపై కేంద్రీకరించడం, స్థానిక ఆహార అలవాట్లను పెంపొందించుకోవడం వాతావ రణ మార్పు ప్రమాదం పొంచివున్న కాలంలో తక్షణావస రం. ఉదాహరణకు పామాయిల్, సన్‌ప్లవర్ నూనెలు ఎం దుకు వాడాలి? మనం పల్లి నూనె, కుసుమ నూనెలు వాడ టం అలవాటు చేసుకోవాలి. ఇవి చాలా మంచి నూనెలు. వాటిని ఇక్కడి వాళ్ళు పట్టించుకోరు. 
    

English Title
Healing with Food Print
Related News