మాక్స్ హెల్త్‌కేర్‌లో హెల్త్‌కేర్ వాటా విక్రయం

Updated By ManamFri, 09/21/2018 - 22:12
Healthcare

Healthcareన్యూఢిల్లీ: మాక్స్ హెల్త్‌కేర్‌లో ఉన్న మొత్తం 49.70 శాతం వాటాను కొహెల్‌బర్గ్ క్రెవిస్ రాబర్ట్ అండ్ కో ఎల్‌పీకి విక్రయిస్తున్నట్లు లైఫ్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ప్రకటించింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ కంపెనీ రూ. 2,120 కోట్లకు ఆ మొత్తాన్ని విక్రయించినట్లు మ్యాక్స్ ఇండియా ఇటీవల వెల్లడించింది. మ్యాక్స్ హెల్త్‌కేర్ నుంచి నిష్క్రమన ద్వారా లైఫ్ హెల్త్‌కేర్ దక్షిణాఫ్రికా, బ్రిటన్, పోలండు, పశ్చిమ యూరప్ కార్యకలాపాలపై దృష్టి సారించనుంది. మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో మొత్తం లైఫ్ హెల్త్‌కేర్ వాటాను పూర్తిగా నగదు రూపంలో చెల్లించనున్నారు. భారత హాస్పిటల్ ప్రముఖ గ్రూపుల్లో ఒకటైన మాక్స్ హెల్త్‌కేర్‌లోకి 26 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా లైఫ్ హెల్త్‌కేర్ 2012లో ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత అది 2014లో దాని వాటాను 46.25 శాతానికి పెంచుకుంది.  ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ వడ్దీ ఆధారంగా లైఫ్ హెల్త్‌కేర్ వాటా ఈ ఏడాదిలో 49.7 శాతానికి పెరిగింది. ఈ లావాదేవీ 2018 డిసెంబర్ నాటికి పూర్తవ్వనుంది. 

English Title
Healthcare share in Max Healthcare
Related News