మళ్లీ రాజుకున్న సుంకాల వేడి

Updated By ManamWed, 09/19/2018 - 00:23
US-CHINA
  • చైనాపైకొత్తగా 10 శాతం సుంకాలు విధించిన ట్రంప్ 

  • వచ్చే ఏడాది నుంచి 25 శాతానికి పెంపు

US-CHINAవాషింగ్టన్: కొంత కాలంగా వాణిజ్య పరంగా చైనాను హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా మంగళవారం అన్నంత పనీ చేసింది. చైనాకు చెందిన మరో200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల దిగుమతులపై 10 శాతం సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ ప్రకటించారు. ఈ నెల 24 నుంచి ఈ సుంకాలు అమలు కానున్నట్లు ఆయన  తెలిపా రు. అయితే పెంచిన ఈ సుంకాలు ఈ ఏడాది చివరి వరకు మాత్రమే వర్తిస్తాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సుంకా లు 25 శాతానికి పెరుగుతాయని ఆయన  వెల్లడించారు. చైనా అనుచిత వాణిజ్య విధానా ల్లో మార్పు తీసుకురానందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ కొత్త అదనపు సుంకాలు అమెరికన్ కంపెనీలు సము చితంగా చైనా కంపెనీల వ్వవహార శైలికి ప్రతిగా వ్యవహరించే అవకాశం కల్పిస్తాయని అన్నారు.  కాగా ఈ ఏడాది మొదట్లోనే 50 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై 25 శాతం సుంకా లను అమెరికా విధించింది. చైనా నుంచి దిగు మతి చేసుకున్న వస్తువులను కొనుగోలు చేసే వారు ఆయా వస్తువుల ఖరీదులలో పెరుగు దలను క్రమంగా చవిచూస్తారు. ‘‘ఒక వేళ చైనా మా రైతులు, పరిశ్రమలపై ప్రతీకార చర్యలకు పాల్పడితే మేము వెంటనే మూడో దశలో భాగం గా 267 బిలియన్ డాలర్ల సుంకాలను అదనంగా విధిస్తాం ’’ అని ట్రంప్ చైనాను హెచ్చరించారు. గత కొన్ని నెలల నుంచి చైనా దాని అనుచిత వాణిజ్య విధానాలను మార్చుకోవాలని అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది. ఆ దేశం తీసుకోవాల్సిన మార్పుల గురించి తాము ఎప్పటికప్పుడు తాము అనువైన అవకాశాలు కల్పించినట్లు అమె రికా పేర్కొంది. అయినా చైనా వాణిజ్య విధా నాల్లో మార్పురాలేదని అమెరివా ఆరోపించింది. చైనా అమెరికాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్దం కారణంగా ఇరు దేశాలు సుంకాలు, ప్రతి సుంకాలకు పాల్పడుతున్నాయి. తాజాగా విధిచిన సుంకాలపై చైనా దీటుగా స్పందిస్తూ అమెరికాకు ప్రతి సుంకాలు తప్పవని హెచ్చరిం చింది. అయితే ఈ పరిస్థితులపై చర్చించడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. 

Tags
English Title
Heated tires again
Related News