కాంగ్రెస్ లో భారీగా చేరికలు

Updated By ManamFri, 09/07/2018 - 23:42
Uttam kumar reddy
  • సొంత గూటికి చేరుకున్న మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి

  • ఖానాపూర్, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి వందల మంది చేరిక

  • కండువాలు కప్పి ఆహ్వానించిన ఉత్తమ్

uttamహైదరాబాద్: కొత్తవారి చేరికలతో శుక్రవారం గాంధీభవన్ కలకలలాడింది. మహబూబ్‌నగర్, గద్వాల, అదిలాబాద్ జిల్లాలకు చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి సొంత గూడికి చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. సమరసింహారెడ్డితో పాటు గద్వాలకు చెందిన న్యాయవాదులు వసంతరావు ఎక్బోటే, పెద్దరాములు, బాణాల క్రిష్ణమూర్తి, అలంపూర్ నియోజకవర్గ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, విక్రంసింహారెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన చారులత రాథోడ్‌తో పాటు వందలాదిమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.  అదే విధంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన న్యాయవాది జి మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ లో చేరారు. బ్రాహ్మణ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యశ్రీరంగం, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమ్ రావు తనయుడు హరీష్‌రావు తదితరులు కూడా పార్టీలో చేరారు. అందరికీ  ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తమ నాయకులకు పార్టీ కండువాలు కప్పేటప్పుడు కార్యకర్తలు ఆనందంతో ఈలలు వేశారు. చప్పట్లు చరిచారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ డాక్టర్ రామచంద్ర కుంటియా, ఎఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీం అహ్మద్, శ్రీనివాస్ క్రిష్ణణ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ మాజీ నాయకుడు కె జానారెడ్డి, కౌన్సిల్ లో కాంగ్రెస్ మాజీ నేత మహ్మద్ అలీషబ్బీర్, తాజా మాజీ ఎమ్మెల్యేలు డీకే అరుణ, జి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English Title
Heavy inclusions in Congress
Related News