గాల్లో తిరిగే ట్యాక్సీలొచ్చాయ్!

Updated By ManamTue, 03/06/2018 - 16:26
taxi

helitaxiబెంగళూరు: రోడ్డుపై తిరిగే ట్యాక్సీలను చూసే ఉంటారు. కానీ గాల్లో ఎగిరే ట్యాక్సీలను చూశారా. అవును. బెంగళూరులో గాల్లో తిరిగే హెలీ-ట్యాక్సీ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో ఉండే రద్దీ ట్రాఫిక్ నుంచి తప్పించుకుని అతి తక్కువ సమయంలో గమ్యానికి చేర్చే ఉద్దేశంతో ఈ సరికొత్త హెలికాఫ్టర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి. రోడ్డు మార్గాన వెళితే ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి దాదాపు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. కానీ ఈ హెలీ-ట్యాక్సీలో వెళితే పదిహేను నిమిషాల్లోనే గమ్యానికి చేరవచ్చు. ప్రస్తుతం ఈ మార్గంలో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. స్పందన బాగుంటే మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. ఉద్యోగుల సమయ వేళల ప్రకారం ఉదయం 6.30 నుంచి 9.30 మధ్య, సాయంత్రం 3.00 గంటల నుంచి సాయంత్రం 6.15 వరకూ ఈ హెలీ-ట్యాక్సీలు సేవలందిస్తాయి.

English Title
Heli-taxi takes off, users reach B’luru airport from Electronic City in 15 min
Related News