మేమున్నాం

Updated By ManamSat, 08/25/2018 - 00:46
kerala

imageకులాలుగా, మతాలుగా, జాతులుగా, ప్రాంతాలుగా, దేశాలుగా మనం విడివిడిగా విడిపోయిన శకలాలం. కానీ సాటి మనిషికి కష్టమొచ్చిందంటే మాత్రం మనమందరం ఒకే దేహమవుతాం, ఒకే అశ్రునదీప్రవాహమవుతాం, ఒకే గుండెచప్పుడై ప్రతిస్పందిస్తాం. కేరళ కష్టాన్ని ప్రపంచం తన కష్టంగా పలవరిస్తోంది. ఒక రాష్ట్రప్రజల కష్టాన్ని యావద్భారతదేశం తన భుజాలకెత్తుకుని ఓదారుస్తోంది. వరద బీభత్సంతో గాయపడిన కేరళ ప్రజల పట్ల సోషల్ మీడియా సహానుభూతితో స్పందిస్తున్న వైనం బహుదా ప్రశంనీయం. 

కేరళలో అనూహ్యంగా ముంచుకొచ్చిన వరదముప్పు 210 మంది ప్రాణాల్ని బలిగొనడంతో పాటు, దాదాపు పది లక్షల మందిని నిరాశ్ర యుల్ని చేసేసింది. భారత జాతీయ విపత్తు నివారణ బలగాలు పెద్దయెత్తున రక్షణ చర్యల్ని చేపట్టి, దాదాపు పది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేశాయి. భారతీయ సైన్యం, నావికా దళాలు కూడా ఈ విపత్కర పరిస్థితిలో యుద్ధప్రాతిపదికన రక్షణ, సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. అయితే ఇలాంటి విపత్తుల్లో ఇతరుల్ని రక్షించడం భారతీయ సైనికులకు, నావికాదళాలకు కొత్తేమీ కాదు. కానీ వాళ్ళని కూడా ఆశ్చర్యంలో ముంచేసిన ఒక కొత్త అనుభవం మన భారతీయ సైనికులకు, నావికాదళాలకు కేరళ వరదల్లో ఎదురైంది. సైన్యం ఊహించని విధంగా సామాజిక మాధ్యమాల్ని ఆసరా చేసుకుని సాధారణ ప్రజలు వారికి సహాయాన్ని అందించారు. వేలాది మంది భారతీయ పౌరులు తమ స్మార్ట్‌ఫోన్ల సహాయంతో సోషల్ వెబ్‌సైట్స్ ద్వారా కేరళ వరద బాధితుల రక్షణ కోసం సహాయ చర్యల్ని ఉధృతం చేశారు. 

ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా ఆపన్న హస్తాన్ని అందించిన వారిలో పేరెన్నికగన్న స్వచ్ఛంద సంస్థలు కూడా imageఉన్నాయి. భారతదేశంలో యాభై సంవత్సరాలుగా సామాజిక సేవల్ని అందిస్తున్న ‘వరల్డ్ విజన్’ సంస్థ తన వెబ్‌సైట్ ద్వారా కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల్ని ఆహ్వానించింది. ‘‘చాలామంది బాధితులు కట్టుబట్టలతో తమ ఇల్లూవాకి లిని వదిలి వచ్చేశారు. కొంత మంది పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అలాంటి వారిని గుర్తించి, వారికి అత్యవసరమైన ఆహారం, బట్టలు, దుప్పట్లు, దోమల నివారణ మందులు, టూత్‌బ్రష్‌లు, పేస్టు, సబ్బులు వంటి వస్తువులతో మేం వారి కోసం ప్రత్యేక కిట్లు రూపొంది స్తున్నాం. విరాళాల్ని ఈ కిట్ల తయారీ కోసం ఉపయోగిస్తాం’ అని వరల్డ్ విజన్ సంస్థ జాతీయ అధ్యక్షుడు చెరి యన్ థామస్ చెప్పారు. ఈ సంస్థతో పాటు మరో నాలుగు స్వచ్ఛంద సంస్థలు కూడా అమెజాన్ డాట్‌ఇన్ ద్వారా విరాళాల్ని ఆహ్వానిస్తున్నాయి. కేరళలో వరదలు బీభత్సం సృష్టిం చిన తొలిరోజు నుంచి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు కార్యక్షేత్రంలో దిగి, సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు వరల్డ్ విజన్ పదివేల సహాయ కిట్లు తయారు చేసి, బాధితులకు అందించింది. 

కొందరు సాధారణ పౌరులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ స్వంత ఆదాయం నుంచి చేతనైనంత మొత్తాన్ని వరద బాధి తుల సహాయం కోసం వెచ్చిస్తున్నారు. వరదలు పొంచి ఉన్నాయన్న సమాచారం అందగానే కేరళ ప్రభుత్వం అప్రమ త్తమైంది. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ నిపుణులు కేరళ ప్రభుత్వ ఐటి శాఖతో కలిసి పని చేయడం ప్రారంభిం చారు. వారు ‘కేరళ రెస్క్యూ డాట్ ఇన్’ వెబ్‌సైట్‌ని రూపొందించారు. రాష్ట్రంలో వరద తాకిడికి గురైన అనేక జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పని చేయడం కోసం స్వచ్ఛంద కార్యకర్తలు ఈ వెబ్‌సైట్ ద్వారా సంబంధిత అధికారుల్ని సంప్రదించే వీలు కలిగింది. 

imageజాన్ బిన్నీ కరువిల్లా అనే ట్రావెల్ బ్లాగర్ కొచ్చిన్‌లోని ఎర్నాకులంలో రోజుకు 14 గంటలపాటు నిర్విరామంగా పనిచేసే జిల్లా అత్యవసర విభాగంతో సమన్వయం కుదుర్చుకున్నాడు. మొదటగా కరువిల్లా ‘వాట్సాప్’ను ఉపయోగించుకుని సహా య చర్యల్ని ముమ్మరం చేయాలని నిర్ణయించు కున్నాడు. వందలాది మంది సభ్యులతో కూడిన ఐదు వాట్సాప్ గ్రూపుల్లో కరువిల్లా చేరాడు. ఈ గ్రూపులన్నీ కేరళ వరదబాధితుల సహాయ, రక్షణ చర్యల్ని ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నాయి. ఈ గ్రూపుల సభ్యులకు ఆయన తన ఫోన్‌నెంబరును ఇచ్చాడు. పోలీసులు, సైన్యం, నావికాదళాలతో తాను సమ న్వయచర్యల్ని పర్యవేక్షిం చగలనని, ఏదైనా అత్యవసర సమాచారం ఉంటే తనను సంప్రదించాలని కరువిల్లా వాట్సాప్ గ్రూపు సభ్యుల్ని కోరాడు. దాంతో వరదనీటిలో చిక్కుకు పోయిన వాళ్ళు, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వాళ్ళు కరువిల్లాకు ఫోన్లు చేయ డం మొదలైంది. రోజుకు మూడు వందల మంది సహాయాన్ని కోరుతూ ఫోన్లు చేసే వారు.  కేరళలోని బార్టన్ హిల్స్‌కు చెందిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశా లకు చెందిన విద్యార్థులు ‘ఇన్‌స్పైర్’పేరిట ఒక కేంద్రాన్ని నెలకొల్పారు. కరువిల్లా ఈ కేంద్రంతో కూడా కలిసి పనిచేస్తున్నారు. ఈ విద్యార్థులు 1.5 వోల్ట్ బ్యాటరీలు, కేబుళ్ళ సహాయంతో సెల్‌ఫోన్లని ఛార్జింగ్ చేసే 300 పవర్‌బ్యాంక్స్‌ని నెలకొల్పారు. ‘విద్యుత్ సౌకర్యం లేని చోట ఈ పవర్‌బ్యాంక్స్ నిమిషాల వ్యవధిలో 20 శాతం ఫోన్ ఛార్జింగ్‌ను చేయగలవు. వరదనీటిలో చిక్కుకున్న వారికి బబుల్ రేపర్ కాగితంలో ఈ పవర్ బ్యాంక్స్‌ని హెలికాప్టర్ల ద్వారా పంపిణీ చేస్తారు. దీంతో అత్యవసర సహాయం అవసరమైన బాధితులు సంబం ధిత అధికారులకు ఫోన్ చేసి, సహాయాన్ని పొందే వీలు కలుగుతుంది’ అని కరువిల్లా వివరించారు.
 
మరికొందరు సోషల్ మీడియా ద్వారా వరదల అనం తర పరిణామాల గురించి ప్రజల్లో అవగాహనను పెంచే ప్రయత్నం imageచేశారు. ఆనంద్ అప్పుకుట్టన్ అనే 38 ఏళ్ళ కమ్యూనికేషన్ డిజైనర్ కేరళలోని కొట్టాయంలో జన్మించాడు. ఆయన ఇప్పుడు చెన్నైలో నివసిస్తూ ఇన్‌ఫోగ్రాఫిక్స్, యాప్స్ వంటివి డిజైన్ చేస్తున్నారు. విపత్తు నివారణకు సంబంధించిన నిపుణులు కొందరు ఆనంద్‌ను సంప్రదించి, కేరళ వరద బాధితుల కోసం కొన్ని కరపత్రాల్ని డిజైన్ చేయాలని కోరారు. ‘సహాయం చేయాలంటూ అభ్యర్థించిన వ్యక్తుల్ని నేను వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ఆర్థిక సహాయం కాకుండా, నా ప్రతిభతో ఈ విపత్కర సందర్భంలో బాధితులకు ఏదైనా సహాయం చేసి తీరాలన్న నా ఆకాంక్షను వాళ్ళు నెరవేర్చారు’ అని ఆనంద్ చెప్పారు. వెంటనే ‘కేరళ డిజైనర్స్ కొల్లాబరేటివ్స్’ పేరిట ఒక కేంద్రాన్ని నెలకొల్పి, వరదల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై కరపత్రాల్ని రూపొందించారు ఆనంద్. ‘ఒకవేళ మీ కారు వరదనీటిలో చిక్కుకుపోతే, కారులో పాములు, బల్లులు, ఇతర జీవులు ఏవైనా చిక్కుకు పోయాయేమో గమనించాలి. అలా చిక్కుకుని, కారులోనే మరణించిన జంతువుల కళేబరాల్ని మంచినీట బావులకు 24 అడుగుల దూరంలో, నాలుగు అడుగుల లోతు గొయ్యి తీసి పాతిపెట్టాలి. ఇలా చేయడం వల్ల అంటురోగాలు ప్రబలకుండా జాగ్రత్త పడవచ్చు. అలా పాతిపెట్టిన తరువాత దాన్ని సున్నపుపొడితో కప్పాలి...’ వంటి జాగ్రత్తల్ని వివరించే కరపత్రాల్ని ఆనంద రూపొందించాడు.  

మనం మనుషులమైనందుకు నిజంగా గర్వించే సందర్భాలు ఇంత విషాదకరమైనవే కావడం మాత్రం ఒకింత బాధాకరమైన విషయమే! అయినప్పటికీ..., మనం ఇంకా మానుషత్వపు ఆత్మీయతనే శ్వాసిస్తున్నం దుకు గర్విస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా కేరళను ఆదుకొన్న వారికి తలవంచి అభివాదం చేద్దాం. 

మానవీయ స్పర్శ
imageఅతనొక పంజాబీ జర్నలిస్టు, మరొకతను వరదల నుంచి ప్రాణాలతో బయట పడిన వ్యక్తి. ప్రాణాలతో బయట పడిన ఆ అజ్ఞాత వ్యక్తి పేరేమిటో తెలియదు. ఈ జర్నలిస్టు పేరు కూడా మనకు తెలియదు. వాళ్ళిద్దరికీ కూడా ఎదుటి వ్యక్తి పేరేమిటో తెలియదు. పేరు తెలియని బాధితుణ్ణి ఇదిగో ఇలా అక్కున చేర్చుకుని, ఓదార్చి, మరో సురక్షితమైన ప్రాంతానికి చేర్చాడు ఆ జర్నలిస్టు. మానవ త్వాన్ని పరిమళిస్తున్న ఈ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ‘ఇదే నేను గర్వించే నా భారతదేశం. అద్భు తమైన నా దేశం ఇదే...’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ ఆనంద్ మహీంద్రా ఎవరో తెలుసా? భారత దేశంలో కార్లతయారీ రంగ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ కంపెనీకి ఛైర్మన్. ఆయన పోస్ట్ చేసిన మానవీయ స్పర్శను చాటుతున్న ఈ ఛాయాచిత్రం సోషల్ మీడియాలో అందరి హృదయాల్ని ఆకట్టుకుంది. 

‘ఆశ్రయానికి’ సేవ
కేరళను ఆగస్టు 8వ తారీఖు నుంచి ముంచెత్తుతున్న వర్షాలు లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయుల్ని చేశాయి. సర్వస్వాన్ని నీటి పాలు చేసుకుని, ప్రాణాలు అరచేత పట్టుకుని, దొరికిన చోట తలదాచుకున్నారు ప్రజలు. ఆపదలో చిక్కిన సాటి మనుషుల కోసం కొందరు తమ ఇంటి తలుపుల్ని తెరిచారు. మరికొందరు తమకు చేతనైన సాయం చేశారు. బాధితులు పెద్ద సంఖ్యలో పాఠశాలల వంటి ప్రదేశాల్లో రోజుల తరబడి తలదాచుకున్నారు. వానలు కాస్త తెరిపిన పడిన తరువాత కూలిన తమ ఇళ్ళను వెదుక్కుంటూ వారంతా పునరావాస కేందాల్ని వదిలి తమతమ నివాస ప్రదేశాలకు ప్రయాణమయ్యారు. ఏళ్ళకు ఏళ్ళు శ్రమించి ఇటుక, ఇటుక కూర్చి కట్టుకున్న ఇళ్ళు నేలమట్టమయ్యాయి. బాధితులకు తమ జీవితాల్ని పునఃప్రారంభించడానికి చాలాకాలమే పట్టవచ్చు. కానీ కూనన్‌మావు జిల్లాలోని కొంగొర్‌పిల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం పొందిన బాధితులు తమ కృతజ్ఞతను విలక్షణంగా చాటుకున్నారు. ఇళ్ళకు వెనుదిరిగి వెళ్ళేముందు వారంతా తమకు ఆశ్రయమిచ్చిన ఆ పాఠశాలను అద్దంలా శుభ్రపరిచి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ పాఠశాలలోని నాలుగో అంతస్తులో దాదాపు 1200 మంది నాలుగు రోజుల పాటు ఆశ్రయం పొందారు. వాళ్ళు శుభ్రం చేసిన పాఠశాల ఫోటోతో సహా ఈ విలక్షణమైన కృతజ్ఞతను సోషల్ మీడియా ప్రపంచానికి తెలియజెప్పింది. ‘ఈ ప్రదేశం నాకు నాలుగు రోజుల పాటు ఆశ్రమియచ్చింది. అలాంటి చోటును అపరిశుభ్రంగా ఎలా వదిలి వెళ్ళగలం, అందుకే శుభ్రం చేశాం’ అంటూ అక్కడ ఆశ్రయం పొందిన ఒక వ్యక్తి చెప్పిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆపదలో కూడా ‘కృతజ్ఞత’ మాట మరువని ఈ మలయాళీల్ని మెచ్చుకోకుండా ఉండడం ఎవరికి సాధ్యం?!

English Title
help to kerala
Related News