ఇదిగో.. షమీ భార్య మొదటి భర్త ఏమంటున్నాడంటే..

Updated By ManamWed, 03/14/2018 - 15:53
Shami with his wife Haasin Jahan

Hasin Jahan first husband saifuddinకోల్‌కతా: మహ్మద్ షమీ, హాసిన్ జహాన్‌ల మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే సీఓఏ అతడి వ్యవహారాలను పర్యవవేక్షిస్తోంది. అయితే, జహాన్ పెద్ద కుమార్తె మాత్రం ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటోంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆమె.. తన పప్పా, అమ్మ శాంతి రాజీకి రావాలని కోరింది. తనను అంతా ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతున్నారని ఆ అమ్మాయి ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నా తోటి విద్యార్థులు కూడా ఈ పరిణామాల గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు. నువ్వేమైనా మాట్లాడావా అని అడుగుతున్నారు. మీ నాన్న అలాంటి వారా అని ప్రశ్నలు వేస్తున్నారు. మళ్లీ వాళ్లిద్దరూ ఒక్కటవ్వాలని ఆశిస్తున్నా’’ అని ఆమె పేర్కొంది.

హాసిన్ జహాన్ మొదటి భర్త ఏమంటున్నాడంటే...

ఈ వ్యవహారంపై హాసిన్ జహాన్ మొదటి భర్త సైఫుద్దీన్ స్పందించాడు. సూరిలో ఓ కిరాణాకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న తనకు 2010లోనే హాసిన్ జహాన్‌తో విడాకులయ్యాయని చెప్పాడు. తమ ఇద్దరు పిల్లలూ హాసిన్‌తోనే ఉంటారని పేర్కొంటూ కోర్టు తీర్పునిచ్చిందన్నారు. అయితే, ఆమె షమీని పెళ్లి చేసుకున్న తర్వాత తన పిల్లలు తన వద్దకే వచ్చేశారని చెప్పాడు. షమీ పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రేమగా చూసుకుంటుండడంతో షమీనే వాళ్లు ‘పాపా’ అని పిలుస్తున్నారని వివరించాడు. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలపై తన దుకాణానికి వచ్చే వాళ్లు అనేక ప్రశ్నలు అడిగి విసిగించేస్తున్నారని చెప్పాడు. తనకు సంబంధంలేని వ్యక్తుల గురించి ప్రశ్నలు అడుగుతుంటే ఎక్కడలేని చిరాకు వస్తోందని, వారిద్దరూ మళ్లీ ఒక్కటవుతారని ఆశిస్తున్నానని అన్నాడు.

కాగా, సైఫుద్దీన్-హాసిన్ జహాన్‌ల సంతానంలో పెద్దమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, చిన్నమ్మాయి ఆరో తరగతి చదువుతోంది. కాగా, ఈ వ్యవహారంపై హాసిన్ జహాన్ కుటుంబం తీవ్రంగా కలత చెందుతోంది. ఈ వ్యవహారం గురించి ప్రతి ఒక్కరూ మొహం పట్టుకుని అడుగుతున్నారని, అది చాలా ఇబ్బందిగా ఉందని, తమను కుంగదీస్తోందని హాసిన్ జహాన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

English Title
Here Is Shami Wife First Husband Reaction
Related News