తొందరపడటం లేదు: అను

Updated By ManamThu, 09/06/2018 - 17:51
Anu emmanuel in Sailaja Reddy Alludu Movie
Anu emmanuel in sailajareddy alludu

కథ విన్నాకే సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటాను అని అంటుందీ అను ఇమ్మాన్యుయేల్. ఈ అమ్మడు నాగచైతన్య సరసన నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి దర్శకుడు సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలవుతుంది. ఈ సందర్బంగా అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ‘రమ్యకృష్ణగారి కూతురి పాత్రలో నటించాను. ఇగోయిస్టిక్ పాత్ర నాది. ఈ సినిమాలో నా పాత్ర ఎక్కువగా మాట్లాడుతుంటుంది. నిజ జీవితంలో కూడా నేను కాస్త ఇగోయిస్ట్‌గా.. కాస్త కోపంగానే ఉంటాను. 

నేను ఇప్పటి వరకు నటించిన హీరోల్లో డౌన్ టు ఎర్త్ పర్సన్ చైతన్య. అలాగే రమ్యకృష్ణగారితో నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్. ఆవిడ బ్రిలియంట్ పర్సన్. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఓసారి చూసుకుని చెప్పేస్తుంటారు. మంచి పాత్రలు కోసం ఎదురు చూస్తున్నాను.  ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే మరో సినిమా చేసేయాలనే తొందరలో లేను. ఈ సినిమా విడుదలయ్యాక నిలిచి నిదానంగా ఆలోచించి చేస్తాను. 

తమిళంలోనూ మంచి స్క్రిప్ట్‌లు వింటున్నా. మలయాళం ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ మధ్య నివిన్ పాల్‌తో ఓ సినిమా చేస్తే, స్క్రీన్ స్పేస్ మరీ తక్కువగా ఉంది. అలా కాకుండా మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్ నా సొంతిల్లులా ఉంది. ఇక్కడ నిలదొక్కుకున్నాక మిగిలిన పరిశ్రమల మీద కాన్‌సెన్‌ట్రేట్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ‘శైజారెడ్డి అల్లుడు’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.

English Title
Heroine Anu Emmanuel speaking about Sailaja Reddy Alludu Movie
Related News