శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద హైఅలర్ట్

Updated By ManamSun, 08/05/2018 - 09:49
Sriram Sagar Project, Huge police deployed, Armour division 144 section, 

Sriram Sagar Project, Huge police deployed, Armour division 144 section, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాల్కొండ, కోరుట్ల నియోజకవర్గాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రాజెక్టుతో పాటు ఆయకట్టు గ్రామాల్లో రైతులు ఆందోళనకు దిగడంతో 20 గ్రామాల్లో రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు వద్ద బారికేడ్లను సైతం సిద్ధం చేశారు. ఎస్సార్‌ఎస్పీ పరిసర ప్రాంతాలను పూర్తిగా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

ప్రాజెక్ట్ వైపునకు రైతులు, పర్యాటకులను సైతం పోలీసులు అనుమతించడం లేదు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. శ్రీరాంసాగర్‌ నుంచి నీటి విడుదల లేదని ప్రజాప్రతినిధులు తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున తాగునీటి అవసరాల నిమిత్తం వాడాలని, ప్రాజెక్టుకు వరద నీరు వస్తే విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఆందోళనకరంగా మారింది.   

English Title
High alert declared at Sriram sagar project 
Related News