అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు

Updated By ManamWed, 04/25/2018 - 16:57
agri gold
Agri Gold

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గత విచారణలో ఆస్తుల కొనుగోలుపై జీఎస్సెల్‌ గ్రూపు వెనక్కి తగ్గడంతో.. కేసును హైకోర్టు ఇవాళ విచారించింది. రూ.100 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్‌ 10 ఆస్తులను గుర్తించి ప్రభుత్వం వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. జూన్ 5న నాటికి రూ.1500 కోట్లు డిపాజిట్లు చేయాలని జీఎస్సెల్ సంస్థను ఆదేశించింది. ప్రభుత్వ విధానం తెలిస్తేనే ముందు అడుగు వేస్తామని జీఎస్సెల్ సంస్థ తెలిపింది. ఇక తదుపరి విచారణను జూన్‌ 5కు హైకోర్టు వాయిదా వేసింది.

English Title
High Court judgement on Agri Gold Case
Related News