హైకోర్టు విభజన ప్రక్రియ వేగవంతం

Updated By ManamWed, 09/05/2018 - 01:18
high
  • డిసెంబర్ నాటికి పూర్తి

  • సుప్రీం ఆదేశాల మేరకు కొనసాగింపు

highహైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ వేగవంతమైంది. డిసెంబర్ నాటికి హైకోర్టు విభజన జరిగేందుకు మార్గం సుగమమైంది. కొత్త హైకోర్టు ఏర్పాటుకై భవనాల నిర్మాణాలు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుప్రీంకోర్టుకు నివేదించడంతో గడచిన నాలుగున్నరేండ్లుగా ఎదురుచూస్తున్న హైకోర్టు విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశముంది. నిబంధనల ప్రకారం హైకోర్టు విభజన ద్వారానే రాష్ట్ర విభజన సంపూర్ణమవుతుంది. 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటాల తర్వాత 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్ప టికీ, హైకోర్టు విభజన జరగలేదు. ఉన్నత న్యాయస్థానాన్ని విభజించాలని తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో పాటు సుప్రీంకోర్టుకు కూడా అనేక సార్లు విజ్ఞప్తులు చేశాయి. విభజనపై  హైకోర్టుతో పాటు సర్వోన్నత న్యాయస్థానంలో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్ప్)లో ప్రతివాది అయిన ఎపి ప్రభుత్వం హైకోర్టు ఏర్పా టుకు సానుకూలత  వ్యక్తం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. అంతేగాక ఏపీ రాజధాని అమ రావతిలో హైకోర్టు భవనాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, నిర్మాణాలు పూర్తయిన వెంట నే వాటిని సుప్రీంకోర్టుకు అప్పగిస్తామని నివేదిం చింది. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో న్యాయ మూర్తుల కేడర్  సంఖ్య 61 కాగా, చీఫ్ జస్టిస్ తొట్టతిల్ బి రాధాకృష్ణన్‌తో కలిపి 30 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. మిగతా 31 న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  గతేడాది న్యాయమూర్తులు, న్యాయాధికారుల ఆప్షన్ల ప్రక్రియను హైకోర్టు ప్రారంభించింది.  ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు ఎపి, తెలంగాణలకు తమ ఆప్షన్లను ఇచ్చారు. కొత్తగా సీజేగా బాధ్యత లు స్వీకరించిన జస్టిస్ రాధాకృష్ణన్‌ను మినహా యిస్తే మిగతా న్యాయమూర్తుల ఆప్షన్ల వివరాలు ఇచ్చారు. ఇద్దరు న్యాయమూర్తులు ఇవ్వాల్సి ఉంది.

Tags
English Title
Highcourt divide the process of division
Related News