అనిశ్చిత ప్రపంచానికి సరిపోయేది హిందూ మతమే

Updated By ManamFri, 09/21/2018 - 22:44
Shashi Tharoor
  • తెలియని అంశాలపై హిందూ మతం నిలబడింది

  • జైపూర్ సాహిత్య సమ్మేళనంలో శశిథరూర్

SHASHI-THAROORన్యూయార్క్: హిందూ మతంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పద మవుతోంది. జైపూర్ సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో థరూర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత అనిశ్చితి, సందేహాలు, ప్రశ్నలు నిండిన ఆధునిక యుగానికి అతికినట్లు సరిపోయే మతం హిందూ మతమే’’ అని పేర్కొన్నారు. సంశయాలకు కూడా హిందూ మతం విలువనిస్తుందని అన్నారు. మనకు తెలియని అనేక అంశాలపై హిందూత్వం నిలిచిందని, నేటి ప్రపంచానికి తగిన మతంగా నిలబడటానికి అదే కారణమని చెప్పారు.  అనిశ్చితి, సందేహాల శకంలో, సందేహానికి ఆధిక్యతనిచ్చే ప్రత్యేక మతం మీకు (అందుబాటులో) ఉంది అన్నారు. విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్వర్గాన్ని, భూమిని ఎవరు తయారు చేశారు? స్వర్గంలో ఉన్న ఆయనకు తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చు అని రుగ్వేదం చెప్పిందన్నారు. ఏదో ఒక మూస పద్ధతికి అందరూ కట్టుబడవలసి అవసరం హిందుత్వంలో లేదని, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కనుక ఎవరికి వారు తమకు నచ్చిన రూపంలో దేవుడిని ఊహించుకునే అవకాశం హిందూ మతంలో ఉందన్నారు. మనుస్మృతిలో మహిళలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. కులతత్త్వానికి వ్యతిరేకంగా బోధిస్తున్న హిందూ గ్రంథాలను చూపించగలనని వివరించారు.

English Title
Hinduism is fitting for the uncertain world
Related News