చరిత్రకారులు

Updated By ManamThu, 02/15/2018 - 00:32
cricket team
  • తొలిసారి సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ గెలిచిన కోహ్లీ సేన

ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ సేన ఓ కొత్త చరిత్రను రాసింది. ఉపఖండంలోని పిచ్‌లపై కాదు.. విదేశీయులకు ఏమాత్రం సహకరించని teamసౌతాఫ్రికా గడ్డపై. దీంతో 26 ఏళ్ల నిరీక్షణ ఫలించినట్టయింది. సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. సొంత గడ్డపై తిరుగులేని జట్టుకు ఇన్నాళ్లూ వారిజిల్లిన సౌతాఫ్రికాను కోహ్లీ సేన దెబ్బ తీసింది. తొలిసారి కోహ్లీ సేన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాకు వెళ్లిన ప్రతిసారీ టీమిం డియా ఘోరంగా ఓడిపోవడమో లేదా గెలుపు దగ్గరగా వచ్చి చేజార్చుకోవడమో జరిగేది. వరుసగా మూడు వన్డేలు గెలిచిన కోహ్లీ సేన నాలుగో వన్డేలో ఓడిపోవడంతో మళ్లీ పాత కథే పునరావృతమవుతుందేమో అని అనుకున్నారంతా. కానీ ఐదో వన్డేలో అనూహ్య విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయాలను చవిచూడ డంతో తీవ్ర మానసిక వేదనకు గురైన  భారత అభిమానులు ఈ వన్డే సిరీస్ గెలుపుతో ఆ బాధను మర్చిపోయారు. అయితే ఈ ఘనత అంతా మణికట్టు స్పిన్నర్లదే.

ప్రపంచ క్రికెట్‌లోని ఓ పాత చరిత్రను కోహ్లీ సేన తిరగరాసింది. సొంత గడ్డపై బలమైన జట్టుగా పేరొందిన సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను గెలిచి ప్రపంచ క్రికెట్‌ను అబ్బురపరిచింది. మంగళవారం పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా 73 పరుగులతో సౌతాఫ్రికాపై సంచలన విజయం సాధించి చరిత్ర పుటల్లోకెక్కింది. 1992 తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన పురుషుల జట్లలో ఏ ఒక్క జట్టూ.. ఏ ఒక్క ఫార్మాట్‌లోనూ సిరీస్ గెలవలేదు. దీంతో సౌతాఫ్రికాలో సిరీస్ గెలిచిన ఘనత కోహ్లీ సేనకు దక్కింది. మహ్మద్ అజారుద్దీన్ గానీ, సచిన్ టెండూల్కర్ గానీ, సౌరవ్ గంగూలీ గానీ, రాహల్ ద్రవిడ్ గానీ, చివరికి మహేంద్ర సింగ్ ధోనీ గానీ సాధించని రికార్డును కోహ్లీ సేన సాధించింది.


ఈ జట్టు పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. డర్బన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్లతో, సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో 9 వికెట్లతో, కేప్‌టౌన్‌లో జరిగిన మూడో వన్డేలో 124 పరుగులతో గెలిచిన టీమిండియా.. శనివారం వర్షం అంతరాయంteam కలిగించిన నాలుగో వన్డేలో ఓటమిపాలైంది. ఈ వన్డే సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిభ, కృషి అనన్యసామాన్యం. ఐదు ఇన్నింగ్స్‌లలో అతను 429 పరుగులు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉడడం విశేషం. అయితే మణికట్టు స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ సిరీస్ ఆరంభం నుంచి తమ స్పిన్ మాయాజాలంతో ప్రొటీస్‌కు చెమటలు పట్టించారు. టీమిండియా స్పిన్ బౌలింగ్ అంటేనే వణికిపోయేలా చేశారు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కుల్‌దీప్ 16, యజ్వేంద్ర చాహల్ 14 వికెట్లు తీసుకున్నారు. సౌతాఫ్రికాను సొంత గడ్డపై ఓడించడంలో మణికట్టు స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. ఈ ఘనత అంతా స్పిన్నర్లదే. 1992 నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఆరుసార్లు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. తొలి సిరీస్‌లో సౌతాఫ్రికా 5-2తో గెలిచింది. తర్వాత 1996-97లో టీమిండియా 0-4తో ఓటమిపాలైంది. 2000-01లో కెన్యా కూడా పాల్గొన్న ముక్కోణపు సిరీస్‌లో టీమిండియా ఫైనల్లో ఓటమిపాలైంది. 2006-07లో 0-4తో, 2010-11లో 2-3తో, 2013-14తో 0-2తో పరాజయం పాలైంది. 2003 ఐసీసీ వరల్డ్ కప్‌లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. 2009లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ నాకౌట్ దశకు ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇలా ఓడిపోయింది.. ఓడిపోయింది.. ఓడిపోయింది.. అన్న మాటలు వినీ వినీ బేజారెత్తిన భారత అభిమానులకు సౌతాఫ్రికాలో కోహ్లీ సేన సిరీస్ గెలిచిందన్న వార్త ఎనలేని సంతోషాన్నిచ్చింది. ప్రేమికుల రోజున ఈ వార్త తెలియడంతో యువతీ యువకులు మరింత ఉత్సాహంతో వాలెంటైన్స్ డేను జరుపుకున్నారు. తొలుత ఫాఫ్ డు ప్లెసిస్, క్వింటన్ డికాక్ ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ వంటి టాప్ ప్లేయర్స్ ఉన్న సౌతాఫ్రికాను టీమిండియా ఓడించి శెభాష్ అనిపించుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు వన్డేల్లో కుల్‌దీప్, చాహల్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాలుగో వన్డేలో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ భారత మణికట్టు స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొన్నట్టు కనిపించారు. ఆ మ్యాచ్‌లో గెలుపు ధైర్యంతో ఐదో వన్డేలో టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ 274 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా 201 పరుగులకు ఆలౌటైంది.

స్పినన్నర్ల రికార్డును బద్దలు కొట్టిన కుల్‌దీప్, చాహల్

chapelసౌతాఫ్రికాలో విదేశీ స్పిన్నర్ల రికార్డును భారత మణికట్టు స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ బద్దలు కొట్టారు. సౌతాఫ్రికాలో ఆడిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ స్పిన్నర్లుగా రికార్డుల్లోకెక్కారు. 1998-99 సీజన్‌లో ఆడిన ఏడు వన్డేల్లో 12 వికెట్లు తీసిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీర్ ఆర్థర్టన్ రికార్డను కూడా భారత మణికట్టు స్పిన్నర్లు బద్దలు కొట్టారు. ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లకే కుల్‌దీప్ యాదవ్ 16, యజ్వేంద్ర చాహల్ 14 వికెట్లు తీశారు. తొలుత విండీస్ దిగ్గజం రికార్డును చాహల్ బద్దలు కొట్టినట్టయింది. పోర్ట్ ఎలిజబెత్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో పెహ్లువాయోను అవుట్ చేయడంతో కుల్‌దీప్‌కు 13వ వికెట్ లభించింది. ఆ తర్వాత కుల్‌దీప్ నాలుగు వికెట్లు తీసి ఈ సిరీస్‌లో 16 వికెట్లతో నిలిచాడు. మరోవైపు 27 ఏళ్ల చాహల్ కూడా ఈ సిరీస్‌లో సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా కొనసాగుతు న్నాడు. ఐదో వన్డేలో తొలుత డేవిడ్ మిల్లర్‌ను ఎల్‌బిడబ్ల్యూగా అవుట్ చేయడంతో చాహల్‌కు 13వ వికెట్ లభించినట్టయింది. కానీ కుల్‌దీప్ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను బురిడీ కొట్టించి ఇన్నింగ్స్‌కు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.
తొలుత 2 వికెట్లు తీసిన చాహల్ మ్యాచ్ ముగిసే సమయానికి కెరీర్ అత్యుత్తమ 5/22 బౌలింగ్ ఫిగర్స్‌ను సాధించాడు. ఇంతకుముందు 2004-05 సీజన్‌లో జరిగిన ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చెందిన కబీర్ అలీ 13 వికెట్లు, 2008-09లో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ జాన్సన్ 13 వికెట్లు, 2001-02లో జరిగిన ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాకే చెందిన జాసన్ గిల్లెస్పీ 12 వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ డారెన్ గఫ్ మూడు సీజన్లలో (199596, 1999-00, 2004-05) 11 వికెట్లు తీశాడు. 
 

English Title
History created
Related News