ప్రముఖ హాలీవుడ్ నటుడు రెనాల్డ్స్ కన్నుమూత

Updated By ManamFri, 09/07/2018 - 10:54
reynolds

reynoldsప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు బుర్డ్ రెనాల్డ్స్ ఇకలేరు. గుండెపోటుతో గురువారం ఫ్లోరిడాలో రెనాల్డ్స్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన మేనెజర్ ఎరిక్ క్రిట్జెర్ ప్రకటించారు. కాగా 1936లో పుట్టిన రెనాల్డ్స్ ‘గన్‌స్మోక్’, ‘బాక్’ వంటి టెలివిజన్ సిరీస్‌లో పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ‘డెలివరెన్స్’, ‘బూగీ నైట్స్’, ‘లాంగెస్ట్ యార్డ్’ వంటి హిట్ చిత్రాలలో నటించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇక  దర్శకుడిగానూ కొన్ని చిత్రాలను తెరకెక్కించారు రెనాల్డ్స్. వీటితో పాటు ఫ్లోరిడాలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించిన రెనాల్డ్స్.. ‘మై లైఫ్’, ‘ఎనఫ్ అబౌట్ మి’ అనే రెండు ఆటో బయోగ్రఫీలను కూడా రాశారు. లెనాల్డ్స్ మృతిపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

English Title
Hollywood actor reynolds dies at 82
Related News