ఇంటి రేటింగ్?

Updated By ManamSat, 03/10/2018 - 04:17
home

Homeఇంట్లో గృహోపకరణాలు కొనుగోలు చేసే ముందు మూడు నక్షత్రాల గుర్తుందా?.. నాలుగు నక్షత్రాలదా? అన్నింటికంటే ఉత్తమమైన ఐదు నక్షత్రాల రేటింగ్ ఉందా అని చూస్తున్నాం. ముఖ్యంగా వాషింగ్‌మిషన్, రిఫ్రిజిరేటర్ వంటి అధికంగా విద్యుత్తు వినియోగమయ్యే ఉపకరణాల్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఇచ్చే రేటింగ్ ఉన్న వాటినే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లో ఒక పరికరం కొనుగోలులోనే ‘స్టార్ రేటింగ్’ చూస్తున్నప్పుడు.. ఏకంగా ఇల్లు కొంటున్నప్పుడు రేటింగ్ గురించి ఆరా తీయరా అంటే? ఇటీవల కొనుగోలుదారులకు ఎదురవుతున్న అనుభవాలతో కచ్చితంగా వాకబు చేస్తున్నారు అంటున్నారునిర్మాణదారులు.
కొనుగోలుదారుల ఆలోచనలను, అభిరుచులను పరిగణనలోకి తీసుకొంటూ... భారీ ప్రాజెక్ట్‌లు చేపడుతున్న గృహ నిర్మాణ designసంస్థలు.. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) రేటింగ్‌తో వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా వేసవి కాలం వస్తే నగరవాసులు నీటి కోసం అదనంగా చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా కొన్నిసార్లు సమయానికి నీటి లభ్యత లేక ఇబ్బందులు పడటం .. దాదాపు ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు అనుభవమే. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి ఈ సమస్యలు మరీ అధికం. చాలా అపార్ట్‌మెంట్లలో నిత్యం ట్యాంకర్ రానిదే రోజు గడవని పరిస్థితి ఉంటోంది. ఇలాంటి వారు సొంత ఇల్లు కొంటున్నప్పుడు నీటిని ఆదా చేసే ప్రాజెక్టులవైపు మొగ్గు చూపుతున్నారు.

వాననీటి సంరక్షణ 
నీటిని ఎంత మేరకు ఆదా చేసే అవకాశముంది... ఎటువంటి విధానాలు ప్రాజెక్టుల్లో అవలంభిస్తున్నారనే విషయాలూ రేటింగ్‌ను నిర్ధారిస్తాయి. పెద్ద ప్రాజెక్టులన్నీ భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. వర్షం పడిన సమయంలోనే శుద్ధి చేసి వీటిలోకి తరలిస్తున్నారు. దీంతో పాటూ బోర్‌వెల్స్ రీఛార్జ్ అయ్యేలా.. ఇంజెక్షన్ వెల్స్ ఏర్పాటు చేసి ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు. ఇలా అవకాశమున్న అన్ని మార్గాల్లో వాననీటిని సంరక్షిస్తున్నారు. ఇంతేకాకుండా గృహ అవసరాలకు ఉపయోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్‌కు, ఇళ్లలోని టాయిలెట్ ఫ్లషింగ్‌కు వాడేలా చూస్తున్నారు. ఫలితంగా నీరు చాలావరకు ఆదా కావటంతోపాటుగా .. వాడిన నీరు పునర్వినియోగం అవుతుంది. ఇంటి రేటింగ్ నిర్ణయిం చటంలో ఇది ముఖ్యభూమికను పోషిస్తుంది.

వాస్తుతో పాటూ..!
Homeకొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్లలో మార్పులతో స్థిరాస్తి సంస్థలు రేటింగ్ పొందుతున్నాయి. దరఖాస్తులో పొందుపర్చే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తుంది. వీటిని బట్టి ప్రాజెక్ట్‌కు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ రేటింగ్ ఇస్తారు. వాస్తుతో పాటూ ఈ మధ్య ప్రాజెక్ట్‌ల్లో రేటింగ్‌కు పెద్దపీట వేస్తుండటం నిర్మాణ రంగంలో వచ్చిన మార్పునకు నిదర్శనం. నిర్మాణానికి ఉపయోగిస్తున్న సామగ్రి, సాంకేతిక తదితర అంశాలూ రేటింగ్‌లో కీలకమే. ఒకసారి రేటింగ్ ఇచ్చిన గ్రీన్‌ెమ్‌లోకి దిగాక విద్యుత్తు, నీటి ఆదాలో కొనుగోలుదారుడికి స్పష్టంగా తేడా తెలుస్తుందని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు.

 మీ ఇంటికి కూడా.. 
స్థిరాస్తి సంస్థలు నిర్మించే భవనాలే కాదు.. వ్యక్తిగతంగానూ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందవచ్చు. ఎంత విస్తీర్ణంలో ఇంటిని నిర్మిస్తున్నారనే ఆంక్షలేమీ లేవు. రేటింగ్‌కు అవసరమైన విధంగా ఇంటి డిజైన్, ఉపయోగించే సామగ్రి, ఇంకుడు గుంతల ఏర్పాటు, వాననీటి సంరక్షణ, విద్యుత్తు ఆదా వంటి చర్యలతో ఐజీబీసీ రేటింగ్ పొందవచ్చు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో 100 చ.మీ., ఆపై విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లలో ఇంకుడు గుంతలు ఉంటేనే నివాసయోగ్యత సర్టిఫికెట్ ఇచ్చే విధంగా నిబంధనలు మార్చబోతున్నారు.

విద్యుత్తు పొదుపు
ఒకప్పుడు ఇళ్లలో విద్యుత్తు వినియోగం తక్కువగా ఉండేది. వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రస్తుతం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా వేసవిలో ఎంతో అధికంగా ఉంటోంది. ఈ బిల్లులు జేబుకు చిల్లు పెడుతుంటాయి. ఇదంతా ఇంట్లో చల్లదనం కోసమే. నిర్మాణ సమయంలోనే గది ఉష్ణోగ్రతలు కొంతవరకైనా తగ్గించే సామగ్రిని ఉపయోగిస్తే చాలావరకు సమస్య తీరినట్లే కదా! వెలుతురు వచ్చేలా ఇంటి డిజైన్ ఉంటే.. విద్యుత్తు బిల్లు గణనీయంగా తగ్గుతుంది. గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నదీ ఇదే. అందుకే కొత్త ప్రాజెక్ట్‌ల్లో ఇల్లు కొనేటప్పుడు ఐజీబీసీ రేటింగ్ గురించి కూడా ఆరా తీస్తున్నారు.

వస్తేనే ప్రచారం 
real esteteబడా స్థిరాస్తి సంస్థలు ప్రస్తుతం గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ విషయంలో పోటీపడుతున్నాయి. ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న సంస్థలు రేటింగ్ కోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే ఇక్కడ ప్రతీ సంస్థ ప్లాటినం రేటింగ్‌ను ఆశిస్తోంది. ఇది వస్తే గొప్పగా ప్రచారం చేసుకొంటున్నాయి. రేటింగ్ ఏమాత్రం తగ్గినా గోల్డ్, సిల్వర్ వచ్చినా ఆ విషయం వినియోగదారులకు చెప్పడం లేదు.కొత్త అపార్టుమెంట్ కొనేముందు?
మేం కొత్తగా ఓ అపార్ట్‌మెంట్ కొందాం అనుకుంటున్నాం. ఇప్పటికే చాలా చోట్లకెళ్లి చూశాం. ఒక్కో చోట బిల్డరు ఒక్కో రకమైన Homeసమాచారం ఇస్తున్నారు. వాళ్లు చెప్పినవి వినడమే తప్ప మేం ఏం అడగాలో తెలియడం లేదు. ‘అన్ని విషయాలు తెలుసుకుని కొనుక్కోకపోతే మోసపోతారు’ అని ఇంట్లో వాళ్లు హెచ్చరిస్తున్నారు. అపార్ట్‌మెంట్ కొనేముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు. ప్లాట్ కొనేటప్పుడు చాలామంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల న్యాయ సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటారు. డబ్బు నష్టపోవడం, సరైన సదుపాయాల్లేకుండా బాధలు అనుభవించడం వంటివి జరుగుతూ ఉంటాయి. ప్లాట్ కొనేందుకు సిద్ధపడేముందు ప్రధానంగా చేయాల్సింది ఏమిటంటే.. అపార్టుమెంట్‌కు, బిల్డర్‌కు, ల్యాండ్ ఓనర్‌కు ఉన్న యాజమాన్య హక్కులను జాగ్రత్తగా పరిశీలించడం. దస్తావేజులు ఎలా ఉన్నాయో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సామాన్యుడు దస్తావేజులన్నీ సరిగ్గా తెలుసుకోవడం కష్టం గనక సివిల్ ప్రాక్టిస్ చేసే లాయర్‌కు చూపించాలి. దీంతో బిల్డర్‌కు, ఓనర్‌కు క్రయవిక్రయ హక్కులు ఉన్నాయో, లేదో తెలుస్తుంది. క్రయవిక్రయ హక్కులున్నా యని గుర్తించిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లు అడిగే బాధ్యత కూడా కొనుగోలుదారులదే.

ఇల్లే ఆఫీస్ అయితే..
instcart officeఒకప్పుడు ఇల్లు వేరు.. ఆఫీసు వేరుగా ఉండేవి.. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటి నుంచే ఆఫీసు విధుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న ఖాళీ ప్రదేశాలను అందంగా ఆఫీసులాగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. ఆఫీసు ప్రపోజల్స్, డ్రాయింగ్స్, ఇతర ఫైల్స్ ఉంచుకోవటం, ప్రత్యేక కంప్యూటర్ ఏర్పాటు చేసుకోవటం వంటివి ఆఫీసు స్పేస్ వినియోగానికి తప్పని సరి. కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేకుండా ఒక్కోసారి రాత్రివేళల్లో కూడా పనిచేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉండాలి. వర్క్ స్పేస్, స్టడీ ఏరియాలో చెక్కఫ్లోరింగ్ ఉండాలి. ఇలా చేస్తే చప్పుడు ఎక్కువగా వినిపించదు. దీనిపై కార్పెట్ వాడటం వల్ల ధ్వనులను కొంతవరకు నిరోధించవచ్చు. కొన్ని సందర్భాల్లో పనిచేసే చొటే కొంచె విశ్రాంతి తీసుకోవాలనుకుంటే నిద్రపోవడానికి కొంచెం స్థలం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఉంటే బాగా అలసిపోయినప్పుడు పదినిమిషాలు విశ్రాంతి తీసుకొని మళ్లీ పని చేసుకోవచ్చు.  వర్క్‌స్పేస్‌లోనే చిన్న చిన్న షెల్ఫ్‌లు, ర్యాక్‌లు ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎక్కువ పుస్తకాలు ఒకేచోట పెట్టకుండా ఉంటుంది.  చదువుకోవడానికి వాడే వర్క్ స్పేస్‌లో గోడమొత్తం ఒక పెయింటింగ్ గానీ స్టిక్కరింగ్ గానీ ఉంటే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మన వృత్తికి సంబంధించిన జ్ఞాపికలు, బొమ్మలు వంటివి అక్కడ ఉంచడం వల్ల మోటివేటివ్ స్పిరిట్ కలిగే అవకాశం ఉంటుంది.

సోఫాసీనులు కండి..!
beautifulఇళ్లలో లివింగ్ రూం ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. మన కుటుంబ సభ్యులు మొత్తం కలిసి మాట్లాడుకోవడానికి వేదిక లివింగ్ రూం. ఎవరైనాబంధువులు, మిత్రులు వచ్చినప్పుడు వారితో లివింగ్ రూంలోనే కాలక్షేపం చేస్తాం. మన ఖాళీ సమయాన్ని టీవీ చూస్తూనో, మరేదైనా వ్యాపకంతోనో లివింగ్ రూంలోనే గడుపుతాం. అందుకే ఈ గది ఎంత అందంగా.. ఆకర్షణీయంగా ఉంటే మన మూడ్ అంత బాగుంటుంది. లివింగ్ రూంలో ముఖ్యమైన ఫర్నిచర్ సోఫాసెట్లు. ఇప్పుడివి చాలా వెరైటీల్లో మార్కెట్లో దొరుకుతున్నాయి. మన గోడలు గాఢమైన రంగులతోఉంటే ఫర్నిచర్ తేలిక రంగులో ఉండాలి. గోడలు తెల్లగా ఉంటే సోఫా సెట్లు మంచి రంగుల్లో ఉన్నవి తీసుకోవాలి. లివింగ్ రూం కోసం మల్టీపర్పస్ ఛైర్‌లు, సోఫాలను ఎంపిక చేసుకోవాలి. సింగిల్ సీటర్స్‌ని కూడా పెట్టుకొంటే అందంగా ఉంటుంది. ముదురు రంగుల్లో ఉండే కౌచ్‌లు గదిని అత్యంత ఆకర్షణీయంగా మారుస్తాయి. సృజనాత్మకంగా తీర్చిదిద్దిన బెడ్ కమ్ సోఫాసెట్లను కూడా తయారు చేసుకోవచ్చు.

ఇవీ ప్రయోజనాలు.. 
విద్యుత్తు ఆదా 20 నుంచి 30 శాతం 
నీటి ఆదా 30 నుంచి 50 శాతం 
గాలి స్వచ్ఛత పెరుగుతుంది 
పుష్కలంగా పగటి వెలుతురు 

ఇంటిపై పూర్తిగా అవగాహన ఉండాలి! 
ఇంటి కొనుగోలు సమ యంలో ముఖ్యంగా అపార్ట్‌మెంట్ల లోని ఫ్లాట్లలో కార్పెట్ ఏరి యా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా Homeపదాలు వినిపిస్తుం టాయి. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారిలో చాలామందికి ఇవి గందరగోళంగా అన్పిస్తుంటాయి. వీటి గురించి అవగాహన ఉంటే కొనుగోలు సమయంలో ఏజెంట్లు, బిల్డర్లతో ధర విషయంలో మాట్లాడి చకచకా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మన అవసరాలకు తగిన విస్తీర్ణం కలిగిన ఇంటిని సొంతం చేసుకునేందుకు వీలవుతుంది. ఇంట్లో గదుల్లోని గచ్చు పరిధి వరకు విస్తరించిన ప్రాంతాన్ని కార్పెట్ ఏరియాగా పరిగణిస్తారు. గోడలను మినహాయించి లెక్కిస్తారు. ఉమ్మడి స్థలం మెట్లు, లిఫ్ట్, లాబీ, ఆట స్థలం వంటివి ఇందులోకి రావు. కాబట్టి కొనేటప్పుడు కార్పెట్ ఏరియా ఎంత అనేది తెలిస్తే వంటగది, హాలు, పడకగది, పిల్లల గది ఏ విస్తీర్ణంలో రాబోతుందనేది అవగాహనకు రావొచ్చు. చాలామంది బిల్డర్లు కార్పెట్ ఏరియాను వారి బ్రోచర్లలో స్పష్టం చేయరు. బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియాపైనే ధర వసూలు చేస్తారు. సాధారణంగా బిల్టప్ ఏరియాలో 70 శాతం వరకు కార్పెట్ ఏరియా ఉంటుంది. ఇంట్లో గచ్చు, గోడలన్నీ కలిపి బిల్టప్ ఏరియాగా లెక్కిస్తారు. గోడలు 20 శాతం ఆక్రమిస్తాయి. మరో 10 శాతం బాల్కనీ, ఇతరత్రా పోతుంది. మీ ఫ్లాట్ 1000 చ.అడుగుల బిల్టప్ ఏరియా అయితే 30 శాతం ఉపయోగించని స్థలమే ఉంటుంది. వినియోగంలో ఉండే స్థలం 700 చ.అ. మాత్రమే. బిల్టప్ ఏరియాతో పాటు కామన్ ఏరియాను కలిపి సూపర్ బిల్టప్ ఏరియాగా వ్యవహ రిస్తుంటారు. కారిడార్, లిఫ్ట్, లాబీ ఇందులోనే కలుపుతుంటారు. కొందరు బిల్డర్లు ఈతకొలను, గార్డెన్, క్లబ్‌హౌస్ కలిపి లెక్కిస్తారు.

మొక్కలతో ఆహ్లాదం
Homeఇంటిని సుందరంగా తీర్చిదిద్దుకోవడమే కాదు ఆహ్లాద వాతావరణాన్ని పెంపొందించు కోవడం కూడా ఇప్పుడు సరికొత్త ఒరవడి. ఖాళీ స్థలం ఉంటే చాలు అందమైన మొక్కలను లేదా పండ్లనిచ్చేవి పెంచుతున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా మొక్కలను సమకూర్చుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల విదేశాల్లో కనిపించేవీ ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్, మైసూర్ రస్‌బెర్రి, గాయ్‌లార్డియా, నిమేషియా కార్నివాల్ వంటివన్నమాట. ఇక బోన్సాయ్ రకానికి చెందిన పండ్లచెట్లను కూడా తక్కువ స్థలం, ఎత్తులోనే పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. దానిమ్మ, నారింజ, జామ, మామిడి వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఎక్కువ స్థలాన్ని వినియోగించుకునే అవసరం కూడా రాదు. నిర్వహణలోనే కాస్త అప్రమత్తతతో ఉంటే చాలని సూచిస్తున్నారు.

 

ఇల్లు చాలడం లేదా!
ఇల్లు విశాలంగా ఉంటే ఎలాగైనా సర్దుకోవచ్చు. అలంకరించుకోవచ్చు. ఎటొచ్చీ తక్కువ విస్తీర్ణంలో ఉండేవాటితోనే సమస్య. అసలే చిన్నగా ఉండే గదుల్లో సామగ్రితో నింపేస్తే మరింత ఇరుకుగా కన్పిస్తాయి. కొందరి నివాసాలు చూస్తే చిన్నవే. అన్ని రకాల వస్తువులు ఉన్నా ఇరుకనే భావన కల్గదు. కొద్దిపాటి మార్పులతో మీ సొంతింటిని కూడా అలాగే తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. నగరంలోHome షాపింగ్ చేసే అలవాటు ఎక్కువ. అవసరంతోపాటు నచ్చిన వస్తువులను కొనేస్తుంటారు. ఆ సమయంలో ఇంట్లో చోటు లేదనే విషయమే గుర్తుకురాదు. మరి వీటన్నింటితో ఇల్లు నిండిపోతే.. మనుషులు తిరగడానికి చోటెక్కడుంటుంది? ఇందుకోసం ఇంటీరియర్ డిజైనర్లు ఏం సూచిస్తున్నారంటే.. హాలులో ఇదివరకు ఎక్కువగా దివాన్ సెట్స్ కన్పిస్తుండేవి. స్థలాభావంతో వీటి స్థానంలో బహుళ ఉపయోగకరంగా ఉండే ఫర్నిచర్ వచ్చింది. సోపా, దివాన్ రెండింటి అవసరాలు తీరుస్తున్నాయివి. ఇక్కడ వేసే బెడ్ కింది భాగంలో అల్మారాల ఏర్పాటుతో బెడ్‌షీట్‌లు, పాదరక్షలు, ఇతరత్రా వస్తువులను వేర్వేరు అరలలో దాచుకోవచ్చు. పడక గదుల తలుపుల వెనక స్థలం సద్వినియోగానికి పలు మార్గాలు ఉన్నాయి. హ్యాంగర్ ఏర్పాటుతో వాటికి బెల్ట్‌లు, టై, టోపీలు, దుస్తులను తగిలించుకోవచ్చు. ఖాళీగా ఉన్న గోడలను చెక్కతో చేసిన క్యూబ్స్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ స్థలాన్ని కూడా వినియోగించు కోవచ్చు. లోపలి వైపు నుంచి గోడ కన్పిస్తూ ఉంటుంది కాబట్టి గది అందం చెడకుండా ఉంటుంది. పాత ఇళ్లలో అన్ని గదుల్లో సామగ్రి భద్రపర్చేందుకు స్లాబులు నిర్మించేవారు. వీటితోనే గది ఇరుకుగా అన్పిస్తుంది. పైగా వాటిపై వస్తువులు పెడితే గది మరింత చిన్నగా కన్పిస్తుంది. కొంచెం ఖర్చు అయినా కప్‌బోర్డ్‌లు చేయిస్తే.. వస్తువులు బయటకు కన్పించవు కాబట్టి గది శుభ్రంగా, విశాలంగా కన్పిస్తుంది. గది మూలల్లో, గోడ వెంట అల్మారాలు అడ్డంగా ఆక్రమించేలా కాకుండా నిలువుగా ఉండే వాటిని చేయించుకోవాలి. దీంతో ఎక్కువ వస్తువులను వాటిలో సర్దేయవచ్చు. మూలకో, ఎక్కడో ఒక పక్కనే అల్మారా ఉంటుంది కాబట్టి గది విశాలంగా అన్పిస్తుంది.

Tags
English Title
Home rating?
Related News