ఎగుమతుల్లో స్పీడ్ పెంచిన హోండా

Updated By ManamMon, 09/24/2018 - 22:20
honda

hondaన్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా బండ్ల సమష్టి ఎగుమతులు 20 లక్షల మైలురాయిని దాటినట్లు కంపెనీ సోమవారం ప్రకటిం చింది. అది విదేశాలకు ఎగుమతులు ప్రారంభించి 17 ఏళ్ళు అవుతోంది. కంపెనీ దాని స్కూటర్ విభాగంలోని యాక్టివాలను 2001 నుంచి ఎగుమతి చేస్తోంది. అది 10 లక్షల సమష్టి యూనిట్ల ఎగుమతుల మైలురాయిని అధిగమించేందుకు 14 ఏళ్ళు పట్టింది. కానీ, తాజాగా 10 లక్షల యూనిట్లను ఎగుమతి చేసేందుకు  కేవలం మూడేళ్ల సమయం మాత్రమే పట్టిందని కంపెనీ తెలిపింది. ‘‘కొత్త మోడళ్లను తీసుకురావడం, కొత్త మార్కెట్‌లలోకి ప్రవేశించడం, ఇప్పటికే ఉన్న మార్కెట్‌లను బలపర్చుకోవడమనే త్రిముఖ వ్యూహం  మేము 20 లక్షల యూనిట్ల ఎగుమతి మైలురాయిని సాధించడానికి తోడ్పడింది ’’ అని హోండా మోటార్స్ ఇండియా (విక్రయాల) విభాగ సీనియర్ ఉపాధ్యక్షుడు యద్విందర్ సింగ్ గులేరియా అన్నారు. ప్రస్తుతం కంపెనీ 28 దేశాలకు ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తోంది. 

Tags
English Title
Honda increases speed in exports
Related News