ఐశ్వర్యకు అరుదైన గౌరవం

Updated By ManamMon, 09/10/2018 - 01:06
Aishwarya

ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో శనివారం నిర్వహించిన విఫ్ట్(వుమెన్ ఇన్ ఫిలింస్ అండ్ టిలివిజన్) అవార్డ్స్‌లో భాగంగా ఐశ్వర్యకు మెరిల్ స్ట్రీప్ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు అందుకున్న ఏకైక సెలబ్రిటీ ఐశ్వర్యరాయ్ కావడం విశేషం. ఈ వేడుకలో పాల్గొనేందుకు తల్లి బృందా రాయ్, కుమార్తె ఆరాధ్యతో కలిసి వెళ్లారు ఐశ్వర్య. ఈ వేడుకలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఎమిరాల్డ్ అవార్డు అందుకున్నారు.

image


అలనాటి హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ పేరిట ఈ అవార్డును ప్రవేశపెట్టారు. ఇటీవల ఐశ్వర్యరాయ్ నటించిన ‘ఫ్యాన్నే ఖాన్’ విడుదలైంది. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. త్వరలో ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలిసి ఓ సినిమాలో నటించబో తోంది. ‘గులాబ్ జామున్’ పేరుతో రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుంది. 
 

English Title
honor to Aishwarya
Related News