అధికారులు విజయాలు సాధించడం ఎలా?

Updated By ManamTue, 09/04/2018 - 02:14
editorial

ఐఏఎస్ అధికారులకు మొదట్లో పెద్దగా అనుభవం ఉండక పోవచ్చు కానీ, అపారమైన విజ్ఞానం లేదా నాలెడ్జ్ ఉంటుంది. నేరుగా జాయింట్ సెక్రటరీలుగా చేరిన వారిలో కొందరు విజయాలు సాధించారంటే అందుకు కారణం, వారిలో అనుభవంతో పాటు, నాలెడ్జ్ కూడా ఉండడమే.

Sameerప్రభుత్వంలో నేరుగా జాయింట్ సెక్రటరీలుగా చేర డంపై ఇటీవల కొన్ని వ్యాసాలలో స్వామి నాథన్ అయ్యర్, మాజీ ఐఏఎస్ అధి కారి సుదీప్ ధిల్లాన్ లు తీవ్ర వాదోపవా దాలకు దిగారు. ‘‘పబ్లిక్ అడ్మినిస్ట్రేష న్‌లో బాగా అను భవం ఉన్న అధికారి మాత్రమే సూక్ష్మ అంశాలను అవగాహన చేసుకోగలుగుతారు’’ అని సుదీప్ ధిల్లాన్ స్పష్టం చేయగా, స్వామినాథన్ అయ్యర్ ఆయనతో పాక్షికంగా ఏకీభవిస్తూనే, ఇందులో కొన్ని దురవకా శాలు కూడా ఉన్నాయని వాదించారు. ఆయన అభి ప్రాయం ఏమిటంటే, ‘‘ప్రపంచంలో వడి వడిగా మారుతున్న పరిస్థితులు, విస్తారమైన అవకాశాలను అవగాహన చేసుకోకపోవడానికి కూడా ఇది కారణం అవుతుంది’’ అని అయ్యర్ పేర్కొన్నారు. వారి వారి స్థాయిల్లో వారిద్దరూ చెప్పింది నిజమే కావచ్చు. అగ్ర నాయకత్వానికి ఎదగడానికి సంబంధించిన సాంప్రదా యిక మార్గం సొరంగం ఆకారంలో ఉంటుంది. ఆ స్థానానికి చేరడానికి మామూలు అధికారులు అనేక విధాలుగా అనుభవాలను కూడగట్టుకోవాల్సి ఉంటుం ది. చిన్న చిన్న విషయాలను కూడా ఈ ప్రస్థానంలో ఒంటబట్టించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఐఏఎస్ అధికారుల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఐఏఎస్ జీవితంలో మూడు భాగా లుంటాయి. ఇవి: దిగువ స్థాయి, ఎగువ స్థాయి, ఈ రెండింటినీ కలిపే స్థాయి. దిగువ స్థాయిలో ఐఏఎస్ అధికారులు అపారమైన అనుభవాన్ని కూడగట్టు కుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో వారు ఈ అనుభవాన్ని ఉపయోగించుకుంటుంటారు. కొత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అధికారులు ఇప్పటి అనుభవాన్ని, ఇప్పటి పరిస్థితులను పరిగణన లోకి తీసుకుంటారు. ఈ విధంగా కొన్నేళ్ల పాటు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన తర్వాత, వారు అనుభవాల నిధిగా మారిపోతారు. ఆ క్రమంలో సమర్థమైన అధికారులుగా అవతరిస్తారు. ధిల్లాన్ తన వ్యాసాలలో ఈ దశ గురించి చర్చించారు. దిగువ స్థాయి, ఎగువ స్థాయిని కలిపే స్థాయిలో అధికారులు అవసరమైనంత అనుభవాన్ని కూడగట్టుకుంటారు. అయితే, కేవలం ఇటువంటి జ్ఞానమున్నంత మాత్రాన సరిపోదు. అది సరైన మార్గంలో ఉండాలి. అన్ని రకాల అనుభవాలకు ఇది వారధిగా పనిచేయగల గాలి. ఎప్పుడు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవడా నికైనా ఇది తోడ్పడగలగాలి. సమాచారాన్ని తగిన విధంగా ఉపయోగించుకోవడానికి ఇది అవకాశం కల్పించాలి. అది ఎటువంటి అనుభవమైనా కావచ్చు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగపడాలి. కేవలం జిల్లాకే పరిమితం కాకూడదు. ఈ దశ గురించి అయ్యర్ చర్చించారు.

ఎగువ స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారులు తా ము తమ ఉద్యోగ  ప్రస్థానంలో గడించిన అపారమైన అనుభవం నుంచి సరైన భాగాన్ని విడదీసి, సరైన నిర్ణయం తీసుకోవడానికి అలవాటు పడి ఉంటారు. ఈ దశలో అధికారులు ప్రతి అనుభవానికి, ప్రతి పరిస్థితికి తగ్గట్టుగా మనసులో ఒక ప్రత్యేక సూత్రాన్ని ఏర్పరచుకుని అనుసరిస్తుంటారు. గత అనుభవాలను, ప్రస్తుత, సమకాలీన అనుభవాలను క్రోడీకరిం చు కుంటూ, ఒక పద్ధతిలో ఉపయోగిస్తూ వారు తమ ప్రత్యేక సూత్రాన్ని మరింత పదను పెట్టుకుంటుం టారు. వారు తరచూ సరైన, సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సూత్రం ఉపయోగ పడుతుం టుంది. మరో విధంగా చెప్పాలంటే, అధికా రులు కాలక్రమేణా నిపుణులైన అధికారులుగా మారిపోతుం టారు. ఎక్కువగా ఎగువ స్థాయి అధికారులకు ఇది వర్తిస్తుంటుంది. 
   
మూడు రకాల అధికారులు
ఈ ఎగువ స్థాయి అధికారుల్లో మూడు రకాల సామర్థ్యాలు ఉంటాయి. మొదటిది- వారు కొత్త వాటిని ఆవిష్కరించగలుగుతారు. వారి ‘సాహచర్య ఆలోచనా విధానం’ రకరకాల విభాగాలను కలుపు తుంది. ఆలోచనలను కలుపుతుంది. సమస్యల పరిష్కారాన్ని ఏకీకృతం చేస్తుంది. రెండవది- విపత్కర, ప్రతిష్ఠంభన దశల్లో అంటే దిక్కుతోచని స్థితిలో సైతం వారు ముందుకు దూసుకుపోగలుగు తారు. ఎందుకంటే వారు ఏర్పరచుకున్న ప్రత్యేక సూత్రం వారికి మార్గదర్శకత్వం నెరపుతుంది. ఏ దిశలో వెళ్లాలో చెబుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఏది పని చేస్తుందో, ఏది పనిచేయదో తెలియ జేస్తుంది. చివరగా-ఈ విస్తృత రాజకీయ ఆర్థిక వ్యవస్థలో తమ నిర్ణయాలు ప్రభావం ఎలా ఉండబో తుందన్నది వారి కళ్లకు కడుతుంది. ఎందుకంటే, ఈ నిర్ణయం వల్ల ఎవరికి ఎంత మేలు జరగబోతోందో వారు అర్థం చేసుకోగలుగుతారు. ఎవరికి ఏం కావా లో తెలుసుకోగలుగుతారు. ఎవరికి ఎంత అవసరమో గ్రహించుకుంటారు. ఇతరుల మీద దాని ప్రభావం ఎంత ఉంటుందో ఆలోచించగలుగుతారు. మొత్తం మీద ఈ దిగువ, ఎగువ, రెండింటినీ కలిపే స్థాయిలలో అయ్యర్, ధిల్లాన్‌ల వాదాలన్నిటికీ పరిష్కారాలున్నాయి. ఒక ప్రపంచ బ్యాంకు అధికారి చెప్పిన ఓ విషయాన్ని అయ్యర్ ఇక్కడ ప్రస్తావించారు. భారతీయ అధికారులు ప్రపంచ బ్యాంకు అధికారు లతో మాట్లాడేటప్పుడు, తమకన్నీ తెలుసనీ, తమకు ఇక తెలుసుకోవాల్సిందేమీ లేదనే అభిప్రాయం కలిగి స్తుంటారట. అదే చైనా అధికారులు కలిసినప్పుడు, ప్రపంచంలో ఏం జరుగుతోందో మరింతగా తెలుసు కునే ప్రయత్నం చేస్తారట. దీనికి కారణమేమిటంటే, భారతీయ అధికారులలో చాలా మంది దిగువ స్థాయికే పరిమితమైపోతారు. తమ పనికి రాని అనుభ వాలనే ప్రతి దానికీ జోడించే ప్రయత్నం చేస్తుంటారు. కొత్త అనుభవాలను కూడగట్టుకోరు. ఇతరుల అనుభ వాలను పరిగణనలోకి తీసుకోరు. ప్రపంచంలో ఇతర త్రా అందుబాటులోకి వచ్చే అవకాశాలను అందిపు చ్చుకోవడానికి ఈ పద్ధతి అవరోధంగా మారుతున్నా వారు పట్టించుకోరు. 

ఇది ఇలా ఉండగా, నేరుగా జాయింట్ సెక్రట రీగా చేరడం గతంలో జరిగేదని, ఇది అంత విజయ వంతమైన ప్రయోగంగా కనిపించడం లేదని వ్యాఖ్యా నించారు. అయితే, అయ్యర్ మాత్రం ఇలా నేరుగా జాయింట్ సెక్రటరీలుగా చేరినవారిలో పలువురు విజయాలు సాధించారని చెప్పారు. ఇది ఐఏఎస్ అధికారులకు, సాధారణ అధికారులకు మధ్య ఉన్న తేడాగా అయ్యర్ దీన్ని అభివర్ణించారు. ఐఏఎస్ అధికారులకు మొదట్లో పెద్దగా అనుభవం ఉండక పోవచ్చు కానీ, అపారమైన విజ్ఞానం లేదా నాలెడ్జ్ ఉంటుంది. నేరుగా జాయింట్ సెక్రటరీలుగా చేరిన వారిలో కొందరు విజయాలు సాధించారంటే అందుకు కారణం, వారిలో అనుభవంతో పాటు, నాలెడ్జ్ కూడా ఉండడమే. నిజానికి అయ్యర్, ధిల్లాన్‌ల వాదనలు పరస్పర విరుద్ధమైనవేమీ కావు. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి పటిష్టమైన అనుభవంతో పాటు నాలెడ్జ్ కూడా అవసరమేనని తేటతెల్లం చేస్తున్నాయి. అనుభవం, నాలెడ్జ్ మీద ఆధారపడిన సరికొత్త ఆలో చనా విధానంతో ఐఏఎస్ అధికారుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వం లోని మధ్య, ఎగువస్థాయి అధికారులతో పని చేయిం చుకోవడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకో వడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.

Tags
English Title
How do the authorities achieve success?
Related News