ఆపద్ధర్మ ప్రభుత్వం ఎట్ల పన్జేస్తది..?

Updated By ManamFri, 09/07/2018 - 00:33
kcr

 kcrహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో కేర్‌టేకర్ ప్రభుత్వం కొలువు దీరింది. ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రస్తుత ప్రభుత్వాన్నే అపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగాలని గవ ర్నర్ కోరారు. గురువారం నుంచి రాష్ట్రంలో కేసీఆర్ ఆధ్వ ర్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసా గుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి రాజ్యాం గం కల్పిం చిన అనేక అధికారాలు ఉంటాయి. అందుకే దీన్ని పాపులర్ గవర్నమెంట్ అని 
వ్యవహరిస్తారు. అసెంబ్లీ రద్దు అయినందున అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కేర్ టేకర్ ప్రభుత్వం (ఆపద్ధర్మ) అని వ్యవహరిస్తారు. వాస్తవానికి రాజ్యాంగంలో కేర్ టేకర్ ప్రభుత్వం అన్నది లేదు. ఇదో సంప్రదాయంగా వాడుకలోకి వచ్చిన పదం. చట్టసభల్లో మోజార్టీ కోల్పోయిన ప్రభుత్వాలు రాజీనామా చేసిన సందర్భంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితి ఉంటే ఆపద్ధర్మ ప్రభుత్వం , లేకుంటే రాష్ట్రపతి పాలన వస్తుంది. తెలంగాణలో సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశ్యంతో అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా గవర్నర్‌కు సిఫార్సు చేశారు. దీన్ని ఆయన వెంటనే ఆమోదించి, తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ  ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను కోరారు. దీనికి ఆయన అంగీకరించడంతో రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. 

    ఆపద్ధర్మ ప్రభుత్వం అయినప్పటికీ సాధారణ ప్రభుత్వం మాదిరిగానే రోజు వారి పాలన వ్యవహారాలను నడిపించవచ్చు. ముఖ్యమంత్రి, మంత్రులు తమ రోజువారీ విధులను నిర్వహిస్తారు. ఇప్పటికే కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించవచ్చు. రోజువారి పాలనలో భాగంగా ఫైళ్లు క్లీయర్ చేయవచ్చు.  కేర్ టేకర్ ప్రభుత్వానికి ప్రధానమైన విధాన పర నిర్ణయాలను తీసుకునే అధికారం ఉండదు.  అధికారులలను బదిలీ చేయడం, ఆగంతక నిధి నుంచి నిధులను డ్రా చేసే అధికారం ఉండదు.  అప్పటికే మంజూరైన నిధులను ఖర్చు చేయడం, జరుగుతున్న పనుల పురోగతి వంటి వాటిని అజామాషీ చేయవచ్చు. 
  సర్కారియా కమిషన్  కూడా ఈ విషయంలో కేర్ టేకర్ ప్రభుత్వం సాఫీగా తన విధులు నిర్వహించుకోవచ్చని సూచించింది. ఎస్‌ఆర్ బొమ్మై కేసులోనూ సుప్రీం కోర్టు ఇదే తరహా తీర్పు ఇచ్చింది.  ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని తప్పనిసరిగా గవర్నర్‌కు పంపించాల్సి ఉంటుంది. ఆయన ఆమోదంతోనే ఆదేశాలను అమలు చేయాలి. కేర్ టేకర్ ప్రభుత్వం ఆదేశాలను, సూచనలను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదం పొందించాల్సిన అవసరంలేదు. ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్ తిరస్కరించవచ్చు. ఏదైనా ఒక విషయంలో గవర్నర్ నేరుగా ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు. దీన్ని బట్టి అపద్ధర్మ ప్రభుత్వానికి అనేక పరిమితులు ఉన్నాయని అర్ధం అవుతోంది. 

    గుజరాత్‌లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అచ్చం కేసీఆర్ లాగానే కొన్ని నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేయాలని సిఫార్సు చేశారు. దీన్ని గవర్నర్ ఆమోదించారు. ఎన్నికల కమిషన్ మాత్రం సాధారణ ఎన్నికల ముందు ఎన్నికలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. దీంతో అప్పటి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆదేశించింది. ఆ కేసులో ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది. తాజాగా మన రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడంతో సర్వత్రా ఉత్కఠ నెలకొంది..

Tags
English Title
How do you care for the government?
Related News