నరేశ్ కామెంట్స్‌పై జయా బచ్చన్ స్పందన

Updated By ManamTue, 03/13/2018 - 18:30
jaya bachan, naresh agarwal, samajwadi party

jaya bachanసమాజ్‌వాది పార్టీని వీడి బీజేపీలో చేరిన నరేశ్ అగర్వాల్ జయా బచ్చన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజకీయ వివాదం కొనసాగుతూనే ఉంది. తనను కాదని సినిమాల్లో ఆడిపాడే వ్యక్తికి సమాజ్‌వాది పార్టీ రాజ్యసభ టికెట్ ఇచ్చిందంటూ నరేశ్ అగర్వాల్ తన అక్కసు వెళ్లగక్కారు. రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు నరేశ్ అగర్వాల్ వ్యాఖ్యలను ఖండించారు. నరేశ్ అగర్వాల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులు తీవ్రంగా ఖండించారు. అటు తన వ్యాఖ్యల పట్ల నరేశ్ అగర్వాల్ విచారం వ్యక్తంచేశారు. ఎవరి మనోభావాలనూ గాయపరిచే ఉద్దేశం తనకు లేదని వ్యాఖ్యానించారు. 

Read Related Article: ఆ వ్యాఖ్యల పట్ల నరేశ్ విచారం

ఈ నేపథ్యంలో నరేశ్ అగర్వాల్ కామెంట్స్‌పై మీ వైఖరి ఏంటని జయా బచ్చన్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆమె...తాను మొండిదని, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనని వ్యాఖ్యానించారు. 
 

English Title
How Jaya Bachchan Reacted To Naresh Agrawal's Insult
Related News