మార్కెట్లలో భారీ పతనం

Updated By ManamTue, 09/11/2018 - 22:21
BSE
  • సెన్సెక్స్ 509 పాయింట్లు క్రాష్.. 11,300 దిగువకు నిఫ్టీ

bseముంబై: స్టాక్ మార్కెట్‌కు గీటురాయిగా భావించే బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ మంగళవారం 509 పాయింట్లు పతనమై 37,413.13 పాయింట్ల వద్ద ముగిసింది. బి.ఎస్.ఇ సున్నిత సూచి ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం ఒక నెల పైచిలుకు రోజుల్లో ఇదే మొదటిసారి. తీవ్రతరమవుతున్న ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలు పెరగడంతో వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువుల (ఎఫ్.ఎం. సి.జి), లోహాలు, మోటారు వాహనాలు, ఫినాన్షియల్ రంగ షేర్లు భారీ అమ్మకాలకు లోనయ్యాయి. .ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’ వరుసగా రెండోరోజు మంగళవారం నాడు 1 శాతంపైగా క్షీణించింది. మధ్యా హ్నా ట్రేడ్‌లో రూపాయి మునుపెన్నడూ ఎరుగనంతగా రూ. 72.73 స్థాయికి పడిపోవడంతో స్టాక్ మార్కెట్లు దిగువ గతిలో సాగాయి. స్టాక్ మార్కెట్లు మంగళవారం బేర్ల గుప్పిట్లోనే మొదలయ్యాయి. ఏషియన్ ట్రేడ్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో స్టాక్ మార్కెట్‌లో లాభాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపో యాయి. ఆగస్టు 2 (37,165.16) తర్వాత ‘సెన్సెక్స్’కు ఇదే (37,413.13) కనిష్ఠ ముగింపు. ‘సెన్సెక్స్’ సోమవారం 467.65 పాయింట్లు కోల్పోయింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 150.60 పాయింట్లు పతనమై 11,300 మైలురాయికి దిగువన 11,287.50 స్థాయి వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో అది 11,274 నుంచి 11,479.40 మధ్య ఊగిసలాడింది. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతోపాటు,  పెరుగుతున్న ముడి చమురు ధరలు, కనివిని ఎరుగని అధమ స్థాయిలకు పతనమవుతున్న రూపాయి, విస్తృతమవుతున్న వాణిజ్య లోటు దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్లు దెబ్బతినడానికి ప్రధాన కారణాలని ఒక బ్రోకర్ చెప్పారు. 

వడ్డీ రేటు ప్రభావం
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేటును మరికాస్త పెంచవచ్చనే అంచనాలున్నాయి. అదే జరిగితే డాలర్ మరింత పటిష్టపడుతుందని మదుపరులు భావించారు. ప్రవర్థమాన మార్కెట్లలోని విదేశీ ఫండ్లు అమ్మ కాలను వేగవంతం చేయడానికి ఇది కారణమైంది. ఇది కూడా సెంటిమెంట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని బ్రోకర్లు చెప్పారు. మార్కెట్లో నష్టాలు విస్తృతంగా నమోదయ్యాయి. బి.ఎస్.ఇలో 1841 కంపెనీల షేర్లు తగ్గగా, 874 కంపెనీల షేర్లు కొద్దిగా పెరిగాయి. ఈక్విటీ విభాగంలో మొత్తం టర్నోవరు రూ. 3,059.03 కోట్లుగా ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సోమవారం రూ. 841.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు కూడా రూ. 289.66 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించాయని తాత్కాలిక డాటా సూచించింది. 

English Title
The huge fall in the markets
Related News