రజనీకి భారీ సెక్యూరిటీ

Updated By ManamTue, 09/11/2018 - 00:29
rajanikanth

imageరజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రజనీ 165వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘పేట్ట’ అనే టైటిల్‌ని ఇటీవల ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ‘పేట్ట’ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, వారణాశిలో జరగనుంది. నెలరోజులపాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రజనీ కోసం 25 మంది పోలీసులతో భారీ సెక్యూరిటీని ఇచ్చింది. విజయ్ సేతుపతి, సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోపక్క రజనీ నటించిన ‘2.0’ చిత్రం టీజర్‌ను సెప్టెంబరు 13న విడుదల చేస్తున్నారు. శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

English Title
huge security to Rajani
Related News