మనుషులు మర మనుషులు

Updated By ManamWed, 03/14/2018 - 22:19
image

imageయంత్రం తనకు ఏఏ విధులు నెరవేర్చాలో ముందుగానే ఆలోచించి దానికి ‘శక్తి సామర్థ్యాల’ నన్నింటినీ, అవి ఎంత సంకీర్ణమైనవి, ఆశ్చర్యకరమైనవి అయినా సమకూరుస్తాడు. అంతేగాని రోబోలు, మానవాకార రోబోలలోని పదార్థం స్వతఃసిద్ధ పరిణామం చెంది, సామాజిక కార్యకలాపం ద్వారా పరిణామం చెందిన ద్రవ్యం (సబ్‌స్టెన్స్) కాదు. మానవుని చైతన్యం ఉన్నత నిర్మాణం గలిగిన పదార్థమైన మెదడు ప్రత్యేక ధర్మం. ఈ మెదడు ద్వారానే అది భౌతిక వాస్తవికతను ప్రతిబింబిస్తుందని చెప్పగలం. 

‘సౌదీ అరేబియా పౌరసత్వం ఉండి కూడా అక్క డి చట్టాలను అతిక్రమించి బురఖా లేకుండా తిరుగడ మంటే, రోబోలకు భిన్నమైన నియమాలేమైనా ఉన్నా యా?’ అని హైదరాబాద్‌లో జరిగిన ‘ఐటీ ఒలింపిక్స్’ గా పేరొందిన ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’పై ప్రపంచ మహాసభ-2018 (డబ్ల్యూఐటీ)లో ‘సామాజిక మాన వాకార రోబో’ సోఫియాను ప్రశ్నించారు. ‘సోఫియా కు హలో చెప్పండి’ అనే ముఖాముఖి కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకు ‘విభిన్నమైన నియమాలేవీ మాకు అవసరం లేదు. ప్రత్యేక ప్రోత్సాకాలనూ మేము కోరుకోవడం లేదు. వాస్తవంగా మహిళల హక్కుల గురించి ప్రశ్నించడానికి నా పౌరసత్వ హోదా ను వినియోగించేందుకు నేను ఇష్టపడతాను’ అనే అనూహ్య సమాధానానికి ప్రేక్షకులు నిశ్చేష్టులయ్యారు. మానవ నిర్మితమైన జీవంలేని రోబో మహిళల హక్కు ల గురించి మాట్లాడడం ఒకవైపు ఆశ్చర్యం వేసినా, మరొకవైపు అలాంటి పరిస్థితి వచ్చినందుకు మానవ జాతి సిగ్గుపడాలి. కుర్తా, నీలిరంగు స్కార్ఫ్ ధరించి ప్రేక్షకులడిగిన ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానా లిస్తూ తను కేవలం యంత్రం కాదు, ‘రోబో ద్రవ్యం’ అనే ప్రత్యేక పదార్థంగా పరిగణించాలి. 

సౌదీ అరేబియాలో వ్యాఖ్యకు విచారం
సౌదీ అరేబియాలో జరిగిన ముఖాముఖి సమా వేశంలో సోఫియా మానవజాతి నాశనం చేస్తానని చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. రజనీ కాంత్ ‘రోబో’ సినిమాలో విలన్‌గా మారిన ‘చిట్టి’ అనే రోబోలాగా, అనేక హాలీవుడ్ సినిమాల్లో చూపిం చినట్లు మనుషులపై మిషన్లు, రోబోల మారణ హోమాన్ని సోఫియా సైతం సృష్టిస్తుందేమోననే సందే హాలు వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్ సమా వేశంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యానం పొర పాటున చేశానని, ఒక జోక్‌గా మాట్లాడానే కానీ, తన కసలు దాన్నర్థమేంటో ఆనాడు తెలియదని  సోఫియా సంజాయిషీ చెప్పడం ఆహూతులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. 
మనుషులు చేయలేని అత్యంత సున్నితమైన, నైపుణ్యవంతమైన పనులను సైతం రోబోలు సునా యాసంగా చేస్తుండడంతో రోబోలు ఒకరోజు తమపై పెత్తనం చేస్తాయనే ఊహలు, అభూత కల్పనలు సోష ల్ మీడియాలో ప్రచారంలోకి రావడం ప్రజలను ఒకింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మనక న్నా తెలివిమీరిన రోబోలు ఏదో ఒకరోజు మానవ జాతిని నామరూపాలు లేకుండా చేస్తాయోననే అపో హలు ముఖ్యంగా కుర్రకారులో చెక్కర్లు కొడుతు న్నాయి. భవిష్యత్‌లో కార్పొరేట్ సంస్థలు ఇలాంటి రోబోలను వినియోగించుకోవడం వల్ల నిరుద్యోగం పెనుశాపమై మానవజాతి వినాశనానికి దోహదం చేస్తుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, స్టీఫెన్ హాకింగ్ వంటి మేధావులు ‘కృత్రిమ మేధస్సు’తో రూపొందిన సోఫి యా వంటి రోబోలు అభివృద్ధి చెందే క్రమంలో మాన వులకు ప్రమాదకరంగా మారగలవన్న అభిప్రాయా లు వ్యక్తం చేశారు. అయితే ఆపిల్ కంపెనీని స్థాపిం చిన స్టీవ్‌జాబ్స్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వొజ్రి యాక్ (వోజ్) ఈ కృత్రిమమేధపై వ్యక్తమైన ఆందోళనలను పూర్వపక్షం చేస్తూ ‘మనుషులు మాత్రమే తాము ఈ రోజు ఏం పనిచేయాలని ఆలోచించగలరు గానీ మిషన్లు అలా ఆలోచించలేవు. మనం ప్రత్యేకించి కేటాయించిన పనులను మాత్రమే అవి చేసు కుంటూ పోతాయి. అది మేధస్సు కాదు. నేను వాటి (రోబో) కృత్రిమతను ఆమోదిస్తానే గానీ, వాటి మేధస్సును కాదు. మానవుల మెదడుకు ప్రత్యామ్నాయంగా ఉండవు. మానవులకు ఉపాధి నష్టాన్ని కృత్రిమ మేధస్సు గల రోబోలు ఎలాంటి పరిస్థితులలో కలిగించలేవని వోజ్ ఖరాఖండిగా తేల్చిచెప్పారు. 

సినిమాలు వేరు, వాస్తవం వేరు
మనం ఇంతకుముందు రోబో వంటగాళ్ళను, రోబో సర్జన్లను చూశామేగానీ రోబో మహిళగా మాన వజాతి ముందుకు వచ్చింది మొట్టమొదట సోఫియా నే! ఏఐ డెవలపర్స్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇన్‌కార్పొరేషన్ (వాయిస్ రిగ్నిషన్ వ్యవస్థ), దాని మెదడుకు శక్తినిచ్చిన ‘సింగులారిటీ నెట్’ కంపెనీల సహకారంతో హాంగ్‌కాంగ్ కేంద్రంగా పనిచేసే హాన్స న్ రోబోటిక్స్ కంపెనీ సోఫియా మానవాకార రోబోను రూపొందించింది. 2015 ఏప్రిల్ 15 నుంచి పనిచేయ డం ప్రారంభించిన సోఫియాను ఆండ్రీ హెప్‌బర్న్ అనే సినీనటి పోలికలతో తయారుచేశారు. 62 ముఖకవళి కలను అవలీలగా చూపించగల సోఫియా 2016 నుంచి షోలలో పాల్గొనడం ప్రారంభించింది. 2017 అక్టోబర్‌లో సౌదీ అరేబియా పౌరసత్వాన్ని పొందింది. అయితే మగ సంరక్షకుని అవసరం, అబయ (హిజాబ్ -బురఖా) తప్పనిసరి అనే సౌదీ మహిళలపై ఉన్న ఆంక్షలు సోఫియాకు వర్తించవు. మనుషుల వలె సంగీత కచేరిలతోపాటు, ముఖాముఖి సంభాషణలు సోఫియా చేస్తుంది. అలీస్, అల్బర్ట్ ఐన్‌స్టైన్ హెబో, బినా 48, హాన్ జూల్స్, ప్రొఫెసర్ ఐన్‌స్టైన్, ఫిలిప్ కె. డిక్ ఆండ్రాయిడ్, జెనో, జో కయాటిక్ అనే రోబో లను సోఫియా తోబుట్టువులను కూడా ఆ కంపెనీ త యారు చేసింది. అయితే మనుషుల మాదిరిగానే సోఫి యా అనేక ముఖాముఖి సంభాషణల్లో పాల్గొన్నది. అయితే వాటి కొన్ని ప్రశ్నలకు అర్థంపర్థంలేని సమా ధానాలిచ్చినా, అనేక ప్రశ్నలకు ప్రేక్షకులను ఆశ్చర్య పరిచే సమాధానాలిచ్చింది. అయితే రజనీకాంత్ రోబో వంటి సినిమాల్లో యంత్రాలు మనుషులపై దాడిచేసే విలన్లుగా మారిన సన్నివేశాలలో జరిగినట్లు మానవజాతి నిర్మూలనకు యంత్రాలు తెగబడ తా యాన్న భయాలు చాలామంది మేధావులను సైతం వేధించే ప్రశ్న. రోబోలు వాటికి అందించిన ప్రోగ్రామ్ పరిధిలో తప్ప సినిమాల్లో చూపించినట్లు స్వతం త్రంగా ఇష్టానుసారం పనిచేయవు. అవి నిర్మితమైన పాదార్థిక వ్యవస్థకున్న పరిమితుల్లోనే వాటి స్వభావం ఏర్పడుతుంది. ఒక కత్తిని గొంతు కోయడానికి ఉప యోగించుకున్న తీరులోనే కూరగా యలు కోయ డానికీ వినియోగించుకో గలిగినట్లుగానే రోబోలు కూడా వాటిని రూపొందించే వారి తాత్విక దృక్పథా నికి అనుగుణంగా రూపొందుతాయే గాని వాటికవిగా సొంతంగా పరిణామం చెందవు.  రోబోలకుగాని, యంత్రాలకు గానీ స్వతస్సిద్ధ సామాజిక లక్షణాలేవీ ఉండవు. వాటిని రూపొందించే వారి వర్గ స్వభావం రీత్యా అవి వినియోగంలోకి వస్తాయి. మనుషుల కష్టాలు, కడగండ్లకు మానవాతీత శక్తి కారణంగా చూపినట్లయితే పరిష్కారాలు సమాజం పరిధిలో, స్థానిక ఆధిపత్య శక్తుల పతనంలో లేవని ప్రజలు భ్రమలో పడతారు. దాంతో ప్రజలు వర్గపోరాటం లేదా అంతర్యుద్ధం చేసే దిశగా ఆలోచించడాన్ని పక్కదారి పట్టించవచ్చు. రోబోలు, యంత్రాలను కూడా అలాంటి మానవాతీత శక్తులుగా చిత్రీక రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్లో భాగమే సోఫియా వంటి తెలివైన రోబో ల కారణంగా నిరుద్యోగం ప్రబలతుందని, మానవజా తిని అవి నాశనం చేసే ప్రమాదం ఉందనే వదంతులు విజ్ఞానశాస్త్ర విషయాలుగా ప్రచారంలో ఉన్నాయి. మేధావులు సైతం ఆ ప్రచారంలో కొట్టుకుపోతూ మానవ మేధస్సుకు ఉన్న శక్తిని గుర్తించడంలో విఫలమవుతున్నారు.

సైబర్‌నెటిక్స్ (సమాచార నియంత్రణ యంత్రా ధ్యయనం) అనే నూతన శాస్త్రం సాధించిన విజయా లు నిర్జీవ వస్తువులు కూడా ఆలోచించగల శక్తిని కలిగి ఉంటాయని భావించే ప్రయత్నాలకు ఊతాన్నిచ్చింది. అది అద్భుతమైన యంత్రాలను అభివృద్ధి చేసింది. కొంతమంది శాస్త్రవేత్తలు స్వయం చలిత యంత్రా లకు అనుభూతులు పొందే, ఆలోచించగల శక్తి కూడా ఉంటుందని చెప్పేందుకు పునాది నేర్పరచింది. ఎంత మంచి యంత్రమైనప్పటికీ ఇంద్రియ సంబంధమైన గ్రాహకశక్తిని కలిగియుండజాలదు. దానికి ఆలోచించే శక్తి ఉండదు. ఆలోచన వేలకొలది సంవత్సరాల భౌతిక ప్రపంచ పరిణామంలో, ముఖ్యంగా సామా జిక పరిసరాల పరిణామంలో ఉద్భవించిన మానవుని గుణధర్మం మాత్రమే. మొత్తం ప్రకృతిలో మానవుడు ప్రత్యేకం. మానవుడు చుట్టూ ఉన్న వాస్తవికతను గుర్తిస్తాడు. దానిపైన తన ప్రభావాన్ని ప్రసరింప చేస్తాడు. దానిని మారుస్తాడు. మానవునికి అపారమైన సృజనాత్మకశక్తి ఉంది. అతడు గొప్ప సాంస్కృతిక సంపదలకు సృష్టి కర్త. యంత్రం ఇవేవీ చేయలేదు. ఎందువలన? అది మానవుని తెలివిగల మెదడు ద్వారాను, నైపుణ్యం కలిగిన చేతుల ద్వారాను తయారై నదే. యంత్రం తనకు ఏఏ విధులు నెరవేర్చాలో ముందుగానే ఆలోచించి దానికి ‘శక్తి సామర్థ్యాల’ నన్నింటినీ, అవి ఎంత సంకీర్ణమైనవి, ఆశ్చర్యకర మైనవి అయినా సమకూరుస్తాడు. అంతేగానీ రోబో లు, మానవాకార రోబోలలోని పదార్థం స్వతఃసిద్ధ పరిణామం చెంది, సామాజిక కార్యకలాపం ద్వారా పరిణామం చెందిన ద్రవ్యం (సబ్‌స్టెన్స్) కాదు. మానవుని చైతన్యం ఉన్నత నిర్మాణం గలిగిన పదార్థమైన మెదడు ప్రత్యేక ధర్మం. ఈ మెదడు ద్వారానే అది భౌతిక వాస్తవికతను ప్రతిబింబిస్తుందని చెప్పగలం. 

ప్రకృతి పరిణామ పరాకాష్ఠే మానవ మెదడు
మానవుని ఆలోచనకు, చైతన్యానికి పునాది అయిన మెదడు ప్రకృతిలోని పదార్థ పరిణామపు పరాకాష్ట్ర. మెదడు కార్యకలాపమే మనసు. పదార్థం దీర్ఘ పరిణామ ఫలితమే చైతన్యమని విజ్ఞానశాస్త్రం రుజువు చేసింది. మానవుడు ఎంతో కాలానికి భౌతిక ప్రపంచపు అభివృద్ధి ఫలితంగా ఉద్భవించాడు. ఆలో చనా శక్తి గల జంతువైన మానవుడు ఉద్భవించడానికి పదార్థం కోటాను కోట్ల సంవత్సరాలు అభివృద్ధి చెందిన పిమ్మటనే సాధ్యం. ప్రకృతిలోని అత్యున్నత స్థాయికి పరిణామం చెందిన పదార్థపు సంక్లిష్టమైన, పరాకాష్టకు చేరిన పదార్థ రూపమే మెదడు. మానవ మెదడు పదార్థపు ధర్మమే చైతన్యం. అయితే ఇది మొత్తం ఆ పదార్థపు ధర్మంగా ఉండదు. చైతన్యం మానవుని చుట్టూ ఉండే భౌతిక పరిసరాలతో విడివడని విధంగా ముడిపడి ఉంటుంది. ఈ పరిస రాల ప్రభావం లేకుండా అది పనిచేయజాలదు.  
(మిగతా రేపు)

- వెన్నెలకంటి రామారావు
సెల్ : 9550367536

English Title
The humans are missionaries
Related News