అమెరికాపై హరికేన్ పంజా

Updated By ManamSun, 09/16/2018 - 00:09
america
  • కరోలినాపై విరుచుకుపడిన ‘ఫ్లారెన్స్’

  • వివిధ ప్రమాదాల్లో నలుగురి మృతి

  • ఫిలిప్పీన్స్‌లోనూ తుపాన్ బీభత్సం

americaవెల్మింగ్టన్: అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన భీకర హరికేన్ ఫ్లోరెన్స్ అమెరికా తీరాన్ని తాకింది.  తాకుతూనే ఉత్తర, దక్షిణ కరోలినాలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలకు తోడు భీకరమైన గాలులు వీస్తుండటంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉభయ కరోలినాల్లోని నదులు పొంగి పొర్లుతున్నాయి. ఉత్తర కరోలినాలో  ఓ ఇంటిపై చెట్టుకూలి  ఓ మహిళ, ఆమె కూతురు దుర్మరణం పాలయ్యారు. మరో ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. న్యూబెర్న్‌లో రహదారులపై మూడు మీటర్ల ఎత్తువరకు నీరు నిలవడంతో అనేక మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. ఇలా చిక్కుకుపోయిన వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. న్యూబెర్న్ ప్రాంతంలోనే ట్రెంట్, న్యూసే నదులు కలుస్తుండటంతో వరద తీవ్ర ఎక్కువగా ఉంది. కాగా, శుక్రవారం రాత్రి 11 గంటలకు ఫ్లారెన్స్ హరికేన్ తీవ్రత కొద్దిగా తగ్గినా.. ప్రమాదస్థాయి  ఏమాత్రం తగ్గలేదని జాతీయ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. కాగా, ఫిలిప్పీన్స్‌పైనా టైపూన్ మంగ్‌కూట్ పంజా విసిరింది. భీకరమైన గాలులు, వర్షాలతో బీభత్సం సృష్టించింది. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వివిధ ఘటనల్లో ముగ్గురు చనిపోయారని, ఆరుగురు గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు. కగాయన, లుజాన్ దీవులపై హరికేన్ ప్రభావం అధికంగా ఉందని అన్నారు. 

Tags
English Title
Hurricane paw in America
Related News