హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా..

Updated By ManamWed, 03/14/2018 - 23:09
Andhra special status

Andhra special statusఅమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ‘ఆమరణ నిరాహార దీక్ష’ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. హోదా కోసం అవసరమైతే ఆమరణదీక్షకు కూర్చుంటానన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ఎలా ఉంటుందో కేంద్రానికి చూపిద్దామన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి మాలో సజీవంగా ఉందనీ.. రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తామని పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

హోదాపై కేంద్రం ఏదో ఒక సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. పార్లమెంట్‌లో డ్రామాలు ఆడి చేతులు దులుపుకుంటే ఊరుకోమని.. మేం చెవిలో పూలు పెట్టుకొని కూర్చోలేదని పవన్ అన్నారు. ఇది ఒక ప్రత్యేక హోదా సమస్య మాత్రమే కాదనీ.. పార్లమెంట్‌ సాక్షిగా చేసిన వాగ్దానాలను విస్మరించకుండా నిలువరించే పోరాటమని పవన్ తేల్చిచెప్పారు.

English Title
I Am Ready To Do "Amarana Nirahara Deeksha" For AP Special Status said Pawan
Related News